ఎప్పుడూ నిదానంగా, కూల్ గా కనిపించే టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఈ రోజు హైదరాబాద్ లో ఫైటింగ్ సీన్లో కనిపించారు. ఓ సమావేశానికి వచ్చిన తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని ఆయన కూడా గట్టిగానే ప్రతిఘటించారు. తాను ఎండీగా ఉన్న సంస్థ సమావేశంలోనే తనను పాల్గొననివ్వకుండా చేసే ప్రయత్నం చేయడంతో ఆయన ఆగ్రహించి వారి తీరును నిరసించారు.
సికింద్రాబాద్ సైనిక్ పురిలోని హెచ్ ఎంటీ బేరింగ్స్ కమ్యూనిటీ హాల్ లో ఈ రోజు జరిగిన ప్రుడెన్షియల్ షుగర్ కార్పోరేషన్ సంస్థ వార్షిక సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమావేశానికి వచ్చిన సంస్థ ఎండీ - టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని వేదికపైకి రాకుండా అక్కడి వారు అడ్డుకున్నారు. దీంతో సంస్థ ఎండీ చదలవాడ కృష్ణమూర్తి - సంస్థ ఛైర్మన్ వినోదబడేకు మధ్య తోపులాట చోటుచేసుకొని, తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
సంస్థ షేర్ హోల్డర్స్ కు తెలపకుండా సంస్థ వార్షిక సమావేశం నిర్వహించడమేంటని ఛైర్మన్ ను చదలవాడ నిలదీశారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా లెక్కచేయకుండా సంస్థ ఆస్తులను అమ్మేసే యత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/