సంక్రాంతి సందర్భంగా ఇద్దరు అగ్రనటులు తమ కీలక చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమ అభిమానులను ఊరించారు. తన 150 వ చిత్రం ద్వారా ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ చిరంజీవి - గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య బాబు అభిమానులను అలరించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఇద్దరు హీరోలు పోరాట యోధులుగా కనిపించారు. అయితే అదే పోరాట స్పూర్తిని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కనబర్చాలనే డిమాండ్ వస్తోంది. తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు విషయంలో ఆ రాష్ట్ర నటీనటులు కనబర్చిన స్పూర్తిని తెలుగునటులు ముఖ్యంగా ఈ ఇద్దరు నటులు చూపించాలని సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆంధ్రా మేధావుల ఫోరం పేరుతో వేదికను ప్రారంభించిన చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఎంపీగా ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌ను విడపోయిందని, బాలకృష్ణ ప్రస్తుతం అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత వారిద్దరిపై ఉందనేది వారి వాదన. సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు హక్కును సాధించుకునేందుకు నటీనటులు వీధికి ఎక్కగా లేనిది ఆంధ్రుల ఆకాంక్ష కోసం గళం వినిపించేందుకు ఈ ఇద్దరు అగ్రనటులు ఎందుకు ముందుకు రారనేది వారి ప్రశ్న. లాజిక్ ఉన్నట్లుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/