భీమవరం కు బై ఎలక్షన్స్ తప్పవా!

Update: 2019-03-23 09:03 GMT
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రెండు చోట్ల నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇది వరకూ చాలా మంది రాజకీయ నేతలు రెండు చోట్ల నామినేషన్ వేసిన సందర్భాలున్నాయి. పవన్ కల్యాణ్ అన్న చిరంజీవికూడా రెండు చోట్ల నామినేషన్ వేశారు. అయితే చిరంజీవి ఒక  నామినేషన్  రాయలసీమలో రెండోది గోదావరి జిల్లాల్లో వేశారు. సొంతూరు పరిధిలోని నియోజకవర్గంలో చిరంజీవి ఓటమి పాలవ్వవగా - మెగాస్టార్ ను ఎమ్మెల్యేగా గెలిపించింది రాయలసీమ. అయితే అలా గెలిపించినా చిరంజీవి అక్కడ కూడా ఎమ్మెల్యేగా కొనసాగలేదనుకోండి!

ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ పవన్  కల్యాణ్ కథేంటి? ఆయన రెండు చోట్ల నామినేషన్ వేసిన నేపథ్యంలో రెండు చోట్లా గెలుస్తారా, గెలిస్తే ఎక్కడ కొనసాగతారు అనే చర్చ సాగుతోందిప్పుడు. పవన్ కల్యాణ్ పోటీ విషయంలో జనసేన తీవ్రంగా కసరత్తు చేసింది. ఆ విషయాన్ని ఆ పార్టీనే చెప్పింది. పవన్ పోటీ విషయంలో చాలా సర్వేలు చేసి.. సేఫెస్ట్ నియోజకవర్గాలను ఎంపిక చేసి.. వాటిల్లో కూడా బెస్ట్ సేఫెస్ట్ గా భీమవరం, గాజువాక నియోజకవర్గాలను ఎంపిక చేసినట్టుగా జనసేన ప్రకటించింది.

ఇలా కచ్చితంగా గెలుస్తాయనే సీట్లలోనే పవన్ ను పోటీ చేయిస్తోంది జనసేన. మరి  ఒకవేళ ఆ పార్టీ లెక్కలు ఫలించి రెండు చోట్లా గెలిస్తే పవన్ కల్యాణ్ ఎక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతారు, ఎక్కడ రాజీనామా చేస్తారు? అంటే.. భీమవరం పేరు వినిపిస్తూ ఉంది.

పవన్ కల్యాణ్ గాజువాక - భీమవరం రెండు చోట్లా నెగ్గిన  పక్షంలో గాజువాకలో ఎమ్మెల్యేగా కొనసాగాలనే ఆలోచనలో ఉన్నారట పీకే. భీమవరం నుంచి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చని ప్రచారం జరుగుతూ ఉంది. ఇది భీమవరం లోనే గట్టిగా సాగుతున్న ప్రచారం.

ఒకవేళ తమ ఊళ్లో పవన్ గెలిస్తే, తాము మళ్లీ ఉప ఎన్నికలకు రెడీగానే ఉండాలని భీమవరం వాసులు అనుకుంటున్నారు. అందుకే.. పవన్ ను గెలిపించినా పెద్దగా ఉపయోగం లేదని.. పవన్ కాకుండా.. వేరే ఆప్షన్ ను ఎంచుకోవడమే మేలనే ఆలోచనలో ఉన్నట్టు భోగట్టా!
Tags:    

Similar News