చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ 2005లో లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు లో భాగంగా లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని శుక్రవారం నమోదు చేయాల్సివుంది. తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, అప్పటివరకు కేసును వాయిదా వేయాలని లక్ష్మీపార్వతి న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి ని పరిగణన లోకి తీసుకున్న కోర్టు, చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసు విచారణను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 20కి వాయిదావేసింది.
14 ఏళ్ల కిందట ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు విచారణను నిలిపేయాలని చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో విధించిన స్టేలు ఆరు నెలలకు మించి కొనసాగరాదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే చంద్రబాబు తెచ్చుకున్న స్టే గడువు కూడా ముగిసిపోయింది. సదరు స్టేకు ఎటువంటి కొనసాగింపు గడువు లేకపోవడంతో.. ఏసీబీ కోర్టు చంద్రబాబు పై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పై తిరిగి విచారణ చేపట్టింది.