ప్రధానికి ఉన్న మనసు.. జగన్‌కి లేదు: కావలి రోడ్ షోలో చంద్రబాబు ఫైర్
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి తేరుకున్న చంద్రబాబు తాజాగా గురువారం.. ఇదే జిల్లాలోని కావలిలో పర్యటించారు. ఉదయం అంతా కూడా.. కందుకూరు మృతు ల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు.. సాయంత్రానికి తేరుకుని, కావలి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు తన రోడ్ షోలో కందుకూరు ఘటనలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. సంతాప సూచకంగా సభాముఖంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. ప్రదాని మోడీకి ఉన్న మనసు సీఎం జగన్‌కు లేకుండా పోయిందని విమర్శించారు. ``ఎక్కడో ఉన్న ప్రధాని స్పందించాడు. కానీ.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం స్పందించడానికి చాలా సమయం పట్టింది`` అని వ్యాఖ్యానించారు.
కందుకూరు బాధిత కుటుంబాలకు పెద్దదిక్కుగా అండగా ఉంటానని చంద్రబాబు ఉద్ఘాటించారు. కావలి ఎమ్మెల్యే అరాచకాలకు ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ``ప్రజలను వేధిస్తే ఎవరైనా ఖబర్దార్`` అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరల పెంచడం పెద్ద పన్ను కరెంటు చార్జీల పెంపు ఇంటిపై కూడా పన్నులు అధికం చేసి బాధిస్తోన్నారని ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.
కందుకూరులో తాము చెప్పిన చోట సమావేశం జరుపలేదంటూ అధికారులు అపవాదులు అంటగట్టి కేసులు నమోదు చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు ఖండించారు. కందుకూరు ఘటన పట్ల స్పందించి బాధితులకు సాయం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ప్రధాని స్పందించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం దారుణమని వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.