ఎన్నికలు దగ్గర పడుతున్నా చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో కూర్చునే మంత్రాంగం నడుపుతున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 14 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నింటిలోకి కుప్పం మీదే అందరి దృష్టి పడింది. దీంతో వైసీపీ సంగతి ఎలాగున్నా చంద్రబాబు మీద మాత్రం ఒత్తిడి పెరిగిపోతోంది. ఇపుడు కుప్పం మునిసిపాలిటిని గనుక తెలుగుదేశంపార్టీ గెలవకపోతే పోయేది చంద్రబాబు పరువే. వైసీపీ గెలవకపోయినా వచ్చే నష్టం ఏమీలేదు.
నిజానికి కుప్పంలో ఓడిపోయినా టీడీపీకి జరిగే డ్యామేజీ ఏమీలేదు. కాకపోతే 30 చంద్రబాబు కోటకే బీటలు వారుతాయనటంలో సందేహంలేదు. దీని ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలో పడితుందేమో అనే ఆందోళన పెరిగిపోతోంది చంద్రబాబులో. అందుకనే కుప్పం మునిసిపాలిటి గెలుపును లైఫ్ అండ్ డెత్ సమస్యగా తీసుకున్నారు. మరింతటి ప్రిస్టేజీగా తీసుకున్నపుడు చంద్రబాబు కూర్చోవాల్సింది హైదరాబాద్ లో కాదు కుప్పంలో. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు రెండు రోజులు పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే.
అప్పుడెప్పుడో రెండు రోజుల పర్యటిస్తే సరిపోదు. ఇపుడు చంద్రబాబు వెళ్ళి కుప్పంలో కూర్చోవాల్సిందే అన్నట్లుగా ఉంది పరిస్ధితులు. పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడుకు బాధ్యతలు అప్పగిస్తే ఉపయోగంలేదు. ఎందుకంటే పాలకొల్లు రాజకీయం వేరు కుప్పం రాజకీయం వేరని రామానాయుడుకు తెలీదు. అలాగే అమరనాధరెడ్డి, దొరబాబు లాంటి వాళ్ళకు బాధ్యత వదిలేస్తే ఉపయోగం ఉండదు. దొరబాబు ఎప్పుడు కూడా జనాల్లో నుండి వచ్చిన నేతకాదు. అలాగే మొన్నటి ఎన్నికల్లో పలమనేరులో అమర్ చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై పార్టీ ఫిరాయింపు ముద్ర చాలా బలంగా పడిపోయింది. పైగా స్ధానికేతురులందరినీ పోలీసులు కుప్పం నుండి బయటకు పంపేశారు.
ఇక కుప్పం నేతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీళ్ళంతా పార్టీ అధికారంలో ఉన్నపుడు ఓ వెలుగు వెలిగి తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళే. వాళ్ళనే ఇపుడు చంద్రబాబు వెతికిపట్టుకుని మళ్ళీ బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని బాధ్యతలు అప్పగిస్తే పార్టీ గెలిచినట్లే. మొన్నటి పరిషత్ ఎన్నికల సమయంలో ఏమైందో చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అప్పుడు కూడా పార్టీ బాధ్యతలు వీళ్ళే చూశారు. 67 ఎంపీటీసీల్లో టీడీపీ గెలిచింది కేవలం మూడింటిలో మాత్రమే.
ఇక నాలుగు జడ్పీటీసీల్లో ఒక్కటీ గెలవలేదు. కాబట్టి వెంటనే చంద్రబాబు కుప్పంలో క్యాంపు వేస్తేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఎంపీటీసీల ఫలితమే రిపీటైనా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కమిటెడ్ గా టీడీపీకి పనిచేసే నేతలు పెద్దగా లేరన్నది అక్కడి టాక్. ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోనే క్యాంపేసున్నారు. హైదరాబాద్ లో కూర్చుని రోజుకు నాలుగు సార్లు కుప్పం నేతలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడినంత మాత్రాన జరిగేదేమీ ఉండదు. కాబట్టి వెంటనే చంద్రబాబు కుప్పంలో క్యాంపేస్తేనే ఏమన్నా ఉపయోగం లేకపోతే ఆశలు వదులు కోవాల్సిందే.