ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతి నుంచి రెవెన్యూ శాఖ జారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖను కేఈ కృష్ణమూర్తి నుంచి తొలగించి మరొకరికి అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అవసరమైతే ఈ శాఖను తనదగ్గరే ఉంచుకోవాలనీ చంద్రబాబు భావిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాజధాని అమరావతికి దసరా రోజు శంకుస్థాపన చేసిన తరువాత ఒకట్రెండు రోజుల్లో మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఆర్డీవోలు - ఉప కలెక్టర్లు - ప్రత్యేక ఉప కలెక్టర్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి నిర్వహిస్తున్న శాఖ మార్పు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొన్న విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేఈ ని లక్ష్యంగా చేసుకుని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్టు తెలుస్తోంది. ఒకవైపు తాను రెండంకెల ప్రగతి కోసం నానా అగచాట్లు పడుతుంటే రెవెన్యూ శాఖలో రెండంకెల అవినీతి జరుగుతోందని, ఈ శాఖ వ్యవహరిస్తున్న తీరుపట్ల ప్రజల్లో ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడుతోందని చంద్రబాబు ఒకింత అసహనానికి గురయ్యారు.
నాలుగు రోజుల క్రితం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉప కలెక్టర్లు, ప్రత్యేక ఉప కలెక్టర్లు 22 మందిని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బదలీ చేశారు. మంత్రి కేఈ ఆదేశాలతో ఆ బదిలీలు జరిగాయి. అయితే... బదిలీల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తికి కొందరు అధికారులు ముడుపులు చెల్లించారని ప్రచారం జరగడంతో నేరుగా చంద్రబాబు జోక్యం చేసుకుని ఆ బదిలీ ఉత్తర్వులను నిలుపు దల చేశారు. మరోవైపు ఆమధ్య కృష్ణా జిల్లాలో మహిళా తహసీల్దార్ పై జరిగిన దాడి విషయంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి సరైన రీతిలో స్పందించలేదన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ మంత్రిగా సచివాలయానికి రాకుండానే నివాసంలో కూర్చుని అప్పుడప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తు న్నారని, కీలక దస్త్రాలను సైతం ఇంట్లోనే పరిశీలిస్తున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ శాఖను కృష్ణమూర్తి నుంచి తప్పించి ఏదైనా ప్రాధాన్యం లేని చిన్న శాఖను ఆయనకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.