ఎంపీ అభ్య‌ర్థుల్ని టోకుగా రిలీజ్ చేసిన బాబు!

Update: 2019-03-19 04:33 GMT
సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని త‌ర‌చూ చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఆయ‌న చేసే క‌స‌ర‌త్తు ఒక ప‌ట్టాన కొలిక్కి రాదు. అదేప‌నిగా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతూ.. ర‌క‌ర‌కాల కాంబినేష‌న్లు ఆలోచిస్తూ ముక్క‌లు.. ముక్క‌లుగా లిస్ట్ విడుద‌ల చేయ‌టం ఆయ‌న‌లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తూ ఉంటుంది. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లోనూ ఈ తీరు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంటుంది.

ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో బాబు చేసిన జాగుకు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింద‌న్న విమ‌ర్శ ఉంది. తాజాగా ఏపీ అసెంబ్లీ అభ్య‌ర్థుల విష‌యంలోనూ ఇదే వైఖ‌రిని అనుస‌రిస్తున్నారు. ఈ తీరు పార్టీ నేత‌ల్లో తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.  టికెట్ల ఎంపిక విష‌యంలో బాబు చేసే త‌ప్పుల్ని ఆయ‌న స‌న్నిహితులు హెచ్చ‌రించారో..లేక‌ బాబుకే అర్థ‌మైందో ఏమో కానీ.. ఎంపీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల విష‌యంలో త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు.

ఏపీలోని పాతిక ఎంపీ స్థానాల‌కు పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను ఒకే విడ‌త‌లో విడుద‌ల చేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత అభ్య‌ర్థుల ఎంపిక‌ను పూర్తి చేసిన ఆయ‌న సింగిల్ లిస్ట్ లో పాతిక మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. లిస్ట్ ను చూడ‌గా.. ప‌ది మంది సిట్టింగుల‌కు గ‌తంలో వారు పోటీ చేసిన స్థానాలే ద‌క్కాయి.

తాజా జాబితాలో ఇద్ద‌రు రాష్ట్ర మంత్రులు.. న‌లుగురు కేంద్ర మాజీ మంత్రులు ఉన్నారు. అనంత‌పురం.. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మాత్రం ప్ర‌స్తుతం ఎంపీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారి రాజ‌కీయ వార‌సుల‌కు టికెట్లు కేటాయించ‌టం గ‌మ‌నార్హం. పాతిక మంది అభ్య‌ర్థుల్లో న‌లుగురు ఎస్సీలు.. ఐదుగురు బీసీలు.. ఒక ఎస్టీ.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించారు.

టీడీపీ విడుద‌ల చేసిన అభ్య‌ర్థుల జాబితాను చూస్తే..
 
  లోక్‌ సభ స్థానం                    అభ్యర్ధి
1.  శ్రీకాకుళం                    కె.రామ్మోహన్‌ నాయుడు

2. విజయనగరం                 అశోక గజపతిరాజు

3. విశాఖపట్నం                  భరత్‌

4.  అనకాపల్లి                     అడారి ఆనంద్‌

5.  అరకు (ఎస్టీ)                  వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌

6.  కాకినాడ                      చలమలశెట్టి సునీల్‌

7.  అమలాపురం(ఎస్సీ)        గంటి హరీష్‌

8.  రాజమహేంద్రవరం           మాగంటి రూప

9.  నర్సాపురం                   వి.వెంకట శివరామరాజు

10. ఏలూరు                      మాగంటి బాబు

11. మచిలీపట్నం                కొనకళ్ల నారాయణ

12. విజయవాడ                 కేశినేని వెంకటేశ్వర్లు (నాని)

13. గుంటూరు                   గల్లా జయదేవ్‌

14. నరసరావుపేట              రాయపాటి సాంబశివరావు

15. బాపట్ల(ఎస్సీ)               శ్రీరామ్‌ మాల్యాద్రి

16. ఒంగోలు                     శిద్దా రాఘవరావు

17. కడప                         సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి

18. నెల్లూరు                      బీదా మస్తాన్‌ రావు

19. నంద్యాల                     ఎం.శివానందరెడ్డి

20. కర్నూలు                    కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి

21. రాజంపేట                    డీకే సత్యప్రభ

22. అనంతపురం                జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి

23. హిందూపురం               నిమ్మల కిష్టప్ప

24. తిరుపతి(ఎస్సీ)             పనబాక లక్ష్మి

25. చిత్తూరు(ఎస్సీ)             ఎన్‌.శివప్రసాద్‌



Tags:    

Similar News