రాజకీయాల్లో నమ్మకాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలియంది కాదు. సుదీర్ఘ విరామం తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు లాంటి వారు.. నమ్మకాల్ని.. ఆచారాల్ని తూచా తప్పకుండా పాటించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆచారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు.
పూజలు.. పునస్కారాలు.. ముహుర్తాలు.. మంచిరోజులు.. ఇలాంటి వాటిని తరచూ పాటిస్తున్న చంద్రబాబు మీద కొందరు విమర్శలు చేస్తున్నా ఆయన పట్టించుకోవటం లేదు. సోమవారం తాత్కాలిక సచివాలయంలోని ఒక గదిని చంద్రబాబు ప్రారంభించటం మర్చిపోకూడదు. నిర్మాణం పూర్తి కాకున్నా.. అరకొరగా తయారు చేసిన గదిని చంద్రబాబు ఎందుకు ప్రారంభించారంటే.. ఈ నెల 29 తర్వాత మంచి రోజులు లేకపోవటమే. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని జూన్ రెండో వారంలో ప్రారంభించాలని భావిస్తున్న నేపథ్యంలో.. అప్పటికి మంచి ముహుర్తం లేని విషయాన్ని గుర్తించిన బాబు.. మంచిరోజుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసేసి.. నిర్మాణం పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న సచివాలయ ఉద్యోగుల్ని కొత్త సచివాలయానికి తరలించాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సోమవారం తన గదిని ప్రారంభించిన చంద్రబాబు కొన్ని ఫైళ్ల మీద సంతకాలు చేయటం తెలిసిందే. తాజాగా ఈ రోజు కూడా కొత్త సచివాలయంలోని తన కార్యాలయానికి చంద్రబాబు వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఏ మాత్రం పనులు పూర్తి కాని భవనానికి మంగళవారం కూడా ఎందుకు వెళ్లారంటే.. ఏదైనా కొత్త పనిని చేసిన తర్వాత ద్వితీయ విఘ్నం లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాగంగా పండితుల సూచన మేరకు రెండో రోజు కూడా తన కార్యాలయానికి వెళ్లి కాసేపు విధులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. నిన్న కూర్చున్నట్లే తన గదిలో కాసేపు కూర్చొని కొన్ని ఫైళ్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.