తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ‌్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఇన్నాళ్లే తానే నెంబర్ వన్ అని,తనకు తిరుగులేదని చేసిన రాజకీయమంతా రోజరోజుకు తనకే ప్రతిబంధకమవుతోందని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయే పరిస్థితి ఎదురైందని, దీంతో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపామని చంద్రబాబు నాయుడు తన వారి వద్ద చెప్పారని అంటున్నారు. తనకు తిరిగి అధికారం వచ్చేలా చేసిన భారతీయ జనతా పార్టీని తాను ఎంతో నమ్మానని - ఇప్పుడు వారే తనను ఇరుకున పెడుతున్నారని చంద్రబాబు వాపోతున్నారు. నాలుగేళ్ల స్నేహంలో భారతీయ జనతా పార్టీతోనూ... ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ - పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలతో ఎంతో స్నేహంగా మెలగడంతో చంద్రబాబు నాయుడికి సంబంధించిన గుట్టుమట్లున్నీ వారు తెలుసుకున్నారంటున్నారు. ఇక్కడి విషయాలు తెలుసుకుందుకు పార్టీకి సంబంధించిన వారిలో కొందరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వేగులుగా పెట్టుకున్నారనే విషయం చంద్రబాబు నాయుడికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
భారతీయ జనతా పార్టీ నాయకుల రాజకీయాలు తెలుసుకోవడంలో విఫలమయ్యానని చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. తన పార్టీ వారిపైనా - తన వారిపైనా ఆదాయపన్ను శాఖ దాడులు చేయించడం - తాజాగా జగన్ పై దాడిని తనకు వ్యతిరేకంగా వాడుకోవాలనుకోవడం వంటివి చంద్రబాబు నాయుడ్ని ఆత్మరక్షణలో పడేశాయంటున్నారు. దీంతో పరిస్ధితి మరింత క్షీణించక ముందే ఈ ఎదురుదాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లి తన రాజకీయ మంత్రాంగంతో భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాను కాంగ్రెస్ తో చేతులు కలిపినా వారిని నమ్మడానికి లేదని - ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుదల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా తనపై కక్ష తీర్చుకునే అవకాశాలున్నాయని చంద్రబాబు నాయుడు అనుమానిస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, వెంకయ్య నాయుడులతో లోపాయికారిగా రాజీ మంత్రం పఠించడం... మరోవైపు ప్రధానికి అత్యంత సన్నిహితులైన అంబానీ వంటి పారిశ్రామిక వేత్తలతో ఉపయోగించుకుని ఈ గండం నుంచి బయటపడాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని అంటున్నారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో సమావేశం జరిగేలోగానే ఇవన్నీ పరిష్కరించుకోవాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ శుక్రవారం "శుభ"వారమవుతోందో.... లేక "ఫ్రై" డేగా మారుతుందో సాయంత్రానికి తేలిపోనున్నదని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.