తెలంగాణ ఎప్పటికి రుణపడి ఉండే ఒకే ఒక్కడు
అయితే.. పార్టీ విధానానికి తగ్గట్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన మన్మోహన్ మాత్రం మౌనంగానే ఉన్నారు.
కోట్లాది ప్రజల కలల్ని తీర్చినోడు. కన్నీళ్లను తుడిచినోడు. ప్రాణ త్యాగాలకు తల్లడిల్లినోడు.. తెలంగాణ నుంచి తీసుకోవటమే కానీ ఇవ్వటం చేతకాని లక్షల నేతలకు భిన్నంగా.. దశాబ్దాల తరబడి వాస్తవంగా మారని డిమాండ్ ను తీర్చినోడు ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క మన్మోహన్ సింగ్ మాత్రమే. తెలంగాణ నుంచి అందరూ తీసుకున్నోళ్లే. ఇవ్వటమే తప్పించి.. తీసుకోని నేత ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ మాత్రమేనని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకు సోనియా గాంధీ ఓకే చెప్పిన తర్వాతే.. రియాలిటీలోకి వచ్చిందన్నది నిజమే అయినప్పటికీ.. ఆ రోజుల్లో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ మోకాలు అడ్డు పెట్టకున్నా.. ఏదో ఒక చిన్న పుల్ల వేసినా.. తెలంగాణ కల సాకారం అయ్యేది కాదు.
తెలంగాణకు రవ్వంత ఇచ్చి.. కొండంత తీసుకున్నోళ్లు ఎందరో. కానీ.. తానేమీ ఆశించకుండా తెలంగాణకు ఇవ్వటమే తప్పించి.. తిరిగి తీసుకోవటం రాని తత్వం ఆయన సొంతం. ఇంత ఎందుకు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని తీర్చిన ఆయన.. దానికి సంబంధించిన చిన్నపాటి క్రెడిట్ తీసుకోవటం కనిపించదు. తెలంగాణ అంశాన్ని టేకప్ చేసి పోరాడి సాధించి క్రెడిట్ ను కేసీఆర్ సొంతం చేసుకుంటే.. తెలంగాణను ఇచ్చింది సోనియాగాంధీగా పేరు సొంతం చేసుకున్నారు.
అయితే.. పార్టీ విధానానికి తగ్గట్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన మన్మోహన్ మాత్రం మౌనంగానే ఉన్నారు. తాను చేయాల్సింది చేసుకుంటూ పోయారు. సోనియా.. కేసీఆర్ కు తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించినట్లుగా కనిపించినప్పటికీ.. అందుకు తన వంతు సాయాన్ని అందించటంలో మన్మోహన్ ముందున్నారు. అయినప్పటికి.. తనకెలాంటి క్రెడిట్ దక్కకపోవటాన్ని ఆయన పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు అదే.. ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.