"నాకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదు. హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం. రేపు మరోసారి ఢిల్లీ వెళ్తా.. ఇతర పార్టీల నేతలను కలుస్తా"
ఢిల్లీ పర్యటనకు కొన్ని గంటల ముందు చంద్రబాబు కామెంట్స్ ఇవి. రీసెంట్ గా ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి బీజేపీయేతరపార్టీలకు సంబంధించిన కీలక నేతలను కలిశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే మరోసారి బాబు ఢిల్లీ వెళ్తున్నారని సరిపుచ్చుకోవడానికి వీల్లేదు. ఈసారి భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి
చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగారు ప్రధాని మోదీ. చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా ఆరోపణలు గుప్పించారు. మోదీ కామెంట్స్ చేసిన కొన్ని గంటలకే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైంది. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపడుతున్న జన్మభూమి కార్యక్రమాన్ని పక్కన పెట్టి మరీ చంద్రబాబు ఢిల్లీ విమానం ఎక్కుతున్నారు. అదే ఇక్కడచర్చనీయాంశమైంది.
మరోవైపు దేశవ్యాప్తంగా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పై సీబీఐ కేసు నమోదవ్వడంతో పాటు - అసెంబ్లీలో టీడీపీ ఎంపీల ఆందోళనలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లడానికి ఇది కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈసారి చంద్రబాబు తన పర్యనట సందర్భంగా ఓ కీలక పరిణామంతో - ఓ కొత్త నిర్ణయంతో తిరిగి అమరావతికి వచ్చే అవకాశం ఉందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Full View