టీడీపీ ఎంపీ టికెట్.. జస్ట్ 60 కోట్లే.?

Update: 2019-02-24 05:54 GMT
అవసరార్థం వాడుకోవడం.. అవసరం తీరాక కూరలో కరివేపాకులా తీసేయడం మన బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన చేతుల్లో మోసపోయినవారంతా కథలు కథలుగా చెబుతుంటారు. గడిచిన ఎన్నికల్లో ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా   వైసీపీ నుంచి టీడీపీ లో చేరినప్పుడు స్వాగతించిన బాబు.. మళ్లీ సీటు కోసం అడిగితే దిమ్మదిరిగే బేరం పెట్టాడట.. అది చూసి సదురు ఎంపీ నోటి వెంట మాట కూడా రాలేదంటే నమ్మండి అంటూ టీడీపీలో చర్చ నడుస్తోంది..

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడిదలో పడ్డ ఎలుక చందంగా మారిందని కథలు కథలుగా చెబుతున్నారు. ఈసారి నంద్యాల ఎంపీ టికెట్ ఆయనకు మరోసారి దక్కడం కష్టంగానే ఉందట.. నంద్యాల ఎంపీ టికెట్ పై చంద్రబాబుకు ఎస్పీవై రెడ్డి విన్నవించుకోగా.. అరవై కోట్ల రూపాయల డబ్బు రెడీగా పెట్టుకోవాలని సూచించారని .. బ్యాంకు డిపాజిట్ పత్రాలను కూడా చూపించాలని అన్నట్టు నంద్యాలలో జోరుగా చర్చ సాగుతోంది.

నంద్యాల ఎంపీ టికెట్ కావాలంటే ఆ మేరకు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉండాలని బాబు దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎస్పీవై రెడ్డికి ఇప్పటికిప్పుడు 60 కోట్లు అనగానే గుండె ఆగినంత పని అయిపోయిందట.. తన సన్నిహితల వద్ద ఇదే విషయంపై వాపోవడంతో అది ఆనోటా ఈనోట బయటకు వచ్చింది.

అసలు చంద్రబాబుకు ఎస్పీవై రెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వడం ఇష్టం లేకనే ఇలా 60కోట్ల నిబంధన పెట్టాడని టాక్ వినిపిస్తోంది. పొమ్మనలేక పొగబెడుతున్నారని.. అందుకే ఇలా మెలిక పెట్టారని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది. మరి ఎస్పీవై రెడ్డికి కాకుండా నంద్యాల టికెట్  బాబు ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది. ఈ భారీ ఖర్చు పెట్టుకునే ఆ అదృష్ట జాతకుడు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే నంద్యాల ఎంపీగా పోటీచేయాలని భూమా అఖిలప్రియను బాబు కోరారని.. కానీ ఆమె ససేమిరా అన్నదని సమాచారం


Tags:    

Similar News