ప్లేస్ మారినా.. బాబు స‌భ‌ల తీరు మార‌లేదే!!

Update: 2017-08-27 04:14 GMT
ప్లేస్ మారినా.. సేమ్ సీన్ రిపీట్ అవుతోంది! ఒక్క‌టే స్పీచ్ వినీవినీ బోర్ కొట్టిందో లేక‌.. ప్ర‌భుత్వంపై అసంతృప్తిని తెలియ‌జేయాల‌నుకుంటున్నారో గానీ.. టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుకు ఎక్క‌డ‌కు వెళ్లినా చేదు అనుభ‌వాలు ఎదుర వుతూనే ఉన్నాయి. ఎన్నిక‌ల‌ ప్ర‌చార స‌భ‌ల్లో ఆయ‌న స్టార్ క్యాంపెయిన‌ర్‌ గా పాల్గొంటున్నా.. జ‌నాల్లో మాత్రం స్పంద‌న క‌నిపించ‌క‌పోవ‌డం టీడీపీ శ్రేణుల‌ను నిరాశ‌కు గురిచేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ఆయ‌న మాట్లాడుతుండ‌గానే జ‌నాలు వెళ్లిపోయిన సంద‌ర్భాలు అనేకం! ఇప్పుడు కాకినాడ ఉప ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లోనూ ఇదే స్పంద‌న‌ క‌నిపిస్తుండ‌టంతో టీడీపీ నేత‌లు ఉక్కిరిబిక్కిర‌వుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓటర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. నోటికొచ్చిన అబ‌ద్దాల‌న్నీ చెప్పార నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నాన్ని చూస్తే.. డొల్ల‌త‌నం అంతా బ‌య‌ట ప‌డిన విష‌యం తెలిసిందే! ఇప్పుడు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల బ‌రిలోనూ చంద్ర‌బాబు స్టార్ క్యాంపెయినర్‌ గా రంగంలోకి దిగారు. కాపు ఉద్య‌మ ప్ర‌భావం ఇక్క‌డ తీవ్రంగా ఉండ‌టంతో.. త‌న గార‌డీ మాట‌ల‌తో వారిని ఆక‌ట్టుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. శనివారం చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ప్రజలు రాకపోవడంతో స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

ఎన్నికల హామీలు నెరవేర్చక పోవడం, కాపులను రిజర్వేషన్ల హామీతో మోసం చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని సర్కార్ పై స్థానికుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉందన్న వాద‌న వినిపిస్తోంది. దీంతో ఆయ‌న ప్ర‌చారంలో జ‌నం ఈ అసంతృప్తి బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కారనే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఏకంగా  చంద్రబాబు సభలకే జ‌నం ఈ త‌ర‌హా నిర‌స‌న తెల‌ప‌డంతో టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోలేదట‌. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ దగ్గర సీఎం మాట్లాడుతుండగా.. టీడీపీ జెండాలు చేతపట్టుకున్న కొందరు మహిళలు.. అదేం పట్టించుకోకుండా కూర్చోవడం గమనించవచ్చు. మహిళలు సభల‌ నుంచి వెళ్లిపోవడం టీడీపీ శ్రేణులకు చెమటలు పట్టిస్తోంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇది పార్టీపై పడుతుందనే చ‌ర్చ‌.. పార్టీలో మొద‌లైంద‌ట‌.
Tags:    

Similar News