భూమాను హెలికాప్టర్లో హైదరాబాద్ తెమ్మన్న బాబు

Update: 2017-03-12 06:33 GMT
నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా నాగిరెడ్డికి గుండెపోటు రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన స్పందించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితిపై అక్కడి పార్టీ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. అవసరమైతే హెలికాప్టర్ లో ఆయన్ను హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారట.
    
భూమా నాగిరెడ్డి గుండెపోటుకు గురయ్యారని తెలియగానే చంద్రబాబు వెంటనే  కర్నూలు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి.. భూమాను హైదరాబాద్ తీసుకురావడానికి అవసరమైతే హెలికాప్టరు వాడాలని సూచించారు. భూమా కుమార్తె అఖిల ప్రియతోనూ చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు తండ్రికి గుండెపోటు రావడంతో ఆయన కూతురు అఖిల ప్రియ హుటాహుటిన అహోబిలం నుంచి నంద్యాలకు వచ్చారు.
    
భూమా రాజకీయంగా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చిందని.. ఇది మూడోసారని చెబుతున్నారు. నేతలంతా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.  కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణి రెడ్డికి, భూమాకు విభేదాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణికి మద్దతు తెలుపుతున్నట్లు భూమా నాగిరెడ్డి శనివారం చంద్రబాబును కలిసి స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే శిల్పా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఆయన ఇలా ఆసుపత్రిపాలవడంతో అంతా షాకయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News