ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రత్యేకహోదా రాదని కుండబద్దలు కొట్టి చెప్పటంతో చంద్రబాబు పరిస్దితి ఒక్కసారిగా ఇరకాటంలో పడింది. ప్రతిపక్షాలు సైతం హోదా గురించి చంద్రబాబుపై అనేక విమర్శలు చేస్తున్నారు. కానీ హోదా విషయంలో ఆచితూచి అడుగు వేయాలే కాని కేంద్రప్రభుత్వంతో కలిమి చేసుకుంటే నష్టం తప్ప లాభం ఉండదనే ఆలోచనతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.వైకాపా అధినేత జగన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపేరుతో కేంద్రమంత్రులందరిని కలిసి వారికి చెలిమిగా ఉంటున్నారు. ఇటీవల కేంద్రమంత్రులను కలిసి చంద్రబాబుపై పిర్యాదు చేయగా కేంద్రం వాటిని స్వీకరించింది..
అంతేకాదు,, పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు కూడా చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను చంద్రబాబు తనవిగా చెప్పుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ నుంచి రిపోర్టులు వెళ్తుండడంతో ఆ పార్టీ అధిష్ఠానం చంద్రబాబుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేంద్రప్రభుత్వంతో చెలిమిగా ఉంటూనే చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు చెందిన మూడో కూటమి నేతలతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కూడా కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం చంద్రబాబును ఇరుకునపెట్టాలనే నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రత్యేక హోదా ఇవ్వకుండా చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.
మరో విషయమేంటంటే.. మనకు రావల్సిన నదీజలాలను ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టి తన్నుకుపోతున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆల్ మట్టి డ్యామ్ మరికొన్ని డ్యామ్ లు అనుమతులు కూడా లేకుండా నిర్మాణాలు చేశారు. దాని పర్యావసానం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్తగా తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాల పరంపర మొదలుపెట్టింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఎన్ని పోలవరాలు కట్టినా తెలంగాణాలో ప్రాజెక్టు నిర్మాణాలు ఆపకపోతే ఆంధ్రాకు కష్టాలు ఎదురవుతాయి. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా తెలంగాణా ప్రభుత్వం యధేచ్ఛగా నిర్మాణాలు చేపడుతుంది. వాస్తవంగా విభజన తరువాత నిర్మించే ఎటువంటి ప్రాజెక్టులైనను నదీ యాజమాన్య సంస్దలు - కేంద్ర జలసంఘం - ఎఫెక్స్ కౌన్సిల్ సంయుక్త అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఎగువ ర్రాష్టాలవారు ఇష్టమొచ్చిన రీతిలో కట్టు కుంటూ పోతే చివరకు ఆంధ్రాలో నీటి కష్టాలు తీవ్రమవుతాయి.
మరోవైపు జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నా దానివల్ల పార్టీలో గొడవలు మొదలవుతున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ రాష్ట్రంపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇలా ఒక్కసారిగా సమస్యలన్నీ చుట్టుముట్టడంతో చంద్రబాబుకు రాహుకాలం వెంటాడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.