ఏపీ ప్రతిపక్ష నాయకుడు - టీడీపీ అధినేత చంద్రబాబులో ఓటమి తాలూకు నీడలు ఇంకా ఆయనను విడిచి పెట్టినట్టు కనిపించడం లేదు. తీవ్ర అసహనానికి లోనవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి నాలుగు మసాలు పూర్తయ్యాయి. రెండో సారి కూడా అధికారంలోకి రావాలని భావించిన చంద్ర బాబుకు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అయితే, దీని నుంచి ఆయన ఇప్పటికీ బయటకు రాలేక పోవడం చాలా విచిత్రంగా ఉందని అంటున్నారు మేధావులు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఆయన చులకన చేస్తుండడం గమనార్హం. సీఎంగా ఉన్న జగన్ పై ఎడా పెడా చేస్తున్న ఆరోపణలు .. బాబుకు బ్యాడ్ నేమ్ తెస్తుండడం గమనార్హం.
``నేరస్తుడు ముఖ్యమంత్రి అయ్యాడు. నేరస్తుడు చెప్పినట్టు మీరు వింటున్నారు`` అంటూ తాజాగా రాష్ట్ర పోలీసులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆయనలోని అసహనం ఇంకా తగ్గలేదని నిరూపించింది. ఎవ రైనా.. ఎంతటి వైరుధ్యం - విరోధ భావాలు ఉన్న నాయకులైనా.. ప్రజా తీర్పును గౌరవించాలి. కానీ - తన ను తాను మేధావిగా చెప్పుకొనే చంద్రబాబు మాత్రం ప్రజా తీర్పును ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతు న్నారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన జగన్‌ను ఓర్వలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా నేరస్తుడు. అంటూ సంబోధించడం గమనార్హం.
తన పార్టీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడిన విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. ఈ క్రమంలోనే సీనియర్లు ఎక్కడికక్కడ మౌనంగా ఉన్నారు. ఒకరిద్దరు ఉన్నప్పటికీ.. పార్టీ నుంచి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకపక్క ఓటమి - మరోపక్క - పార్టీ పరిస్థితి దారుణంగా మారుతుండడంతో చంద్రబాబులో అసహనం నానాటికీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు.. సీఎం జగన్‌పై చేస్తున్న విమర్శలు మేధావులను - సొంత పార్టీ నాయకులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి.
అదే సమయంలో ప్రజలకు చంద్రబాబును మరింత దూరం చేస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రవేశ పెట్టిన - అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రజల్లో ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై సానుకూలత కనిపిస్తోంది. ఆయనపై ఉన్న కేసుల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్ల.. మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని ఆయన ఇప్పటికైనా గ్రహించాలి.