ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇక ఏపీ రాజధాని నుంచే పరిపాలనతో పాటు ఫ్యామిలీని కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ చేసేందుకు రెఢీ అవుతున్నారు. ఇప్పటికే నెల రోజులుగా ఆయన విజయవాడ నుంచే ఏపీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మాటిమాటికి గెస్ట్ హౌస్ లో ఉంటూ పాలన చేయడం కష్టం అవుతుండడంతో చంద్రబాబు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ ఇంటిని తీసుకున్నారు. లింగమనేని ఎస్టేట్ కు చెందిన ఈ ఇంట్లో గత నెల 29నే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పూజలు కూడా చేశారు. ఈ ఇంట్లో మొత్తం ఐదు బెడ్ రూంలు ఉండేలా భువనేశ్వరి దగ్గరుండి మార్పులు - చేర్పులు చేయించారని ఏపీ అధికార వర్గాలు చెప్పాయి. రాష్ర్ట క్యాబినెట్ మీటింగ్ లు, మంత్రుల సమావేశాలను కూడా చంద్రబాబు ఇటీవల విజయవాడ లోనే ఎక్కువగా నిర్వహిస్తున్నారు.
రాజధాని వేగంగా నిర్మాణం జరిగేలా చూడడం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. చంద్రబాబు పై ఏపీ ప్రజలు రాజధానితో పాటు అనేకానేక అంశాలపై నమ్మకాలు పెట్టుకుని ఉండడంతో వాటిని వేగంగా పూర్తి చేసేందుకు చంద్రబాబు విజయవాడలోనే మకాం వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. నవ్యాంధ్రలో తనను నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలకు దగ్గరుండి పనిచేయటం కూడా సరైందని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తీరికలేని బిజీ షెడ్యూల్లో ఉండడంతో చంద్రబాబు ఎప్పుడైనా పది రోజులకో లేదా పక్షం రోజులకో ఒకసారి మాత్రమే కుటుంబంతో గడుపుతున్నారు. ఇకపై వీలును బట్టి కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించేందుకే ఫ్యామిలీ మొత్తాన్ని విజయవాడకు షిఫ్ట్ చేయనున్నారు.
అలాగే యువనేత లోకేష్ కూడా టీడీపీ ఏపీ వ్యవహారాలను ఇక నుంచి పూర్తిగా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం గుంటూరులో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని కొద్ది కాలం పాటు రాష్ర్ట టీడీపీ కార్యాలయంగా వాడుకోనున్నారు. లోకేష్ కూడా తనకు అనువైన ఓ ఇంటిని చూసుకున్నట్టు సమాచారం. గతంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి హెరిటేజ్ బాధ్యతలు నిర్వహించేవారు. కానీ కొద్ది కాలంగా ఆమె తన బాధ్యతలను నారా లోకేష్ సతీమణి..కోడలు బ్రాహ్మణికి అప్పగించారు. దీంతో చంద్రబాబు తన ఫ్యామిలీతో సహా విజయవాడకు షిఫ్ట్ అయ్యేందుకు రెఢీ అవుతున్నారు.