తాజాగా విదేశీ పర్యటనను ముగించుకొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడి విశేషాల్ని చెప్పుకొచ్చారు. బాబులో ఉన్న గొప్పగుణం ఏమిటంటే.. విదేశీ పర్యటనల్ని చేసి వచ్చిన తర్వాత అటు మంత్రివర్గానికి.. ఇటు ప్రజలకు తన విదేశీ విశేషాల గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా తనను ప్రభావితం చేసిన అంశాల గురించి ప్రస్తావిస్తుంటారు. తాజాగా దావోస్.. సింగపూర్ పర్యటనల్ని పూర్తి చేసుకొచ్చిన చంద్రబాబు.. అక్కడ తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
సింగపూర్ లో తనకు కాఫీ ఇచ్చిన రోబో గురించి ఆయన పదే పదే ప్రస్తావించటం గమనార్హం. సదరు రోబో తనకు కాఫీని పర్ ఫెక్ట్ గా ఇచ్చిందన్న బాబు.. సదరు రోబో చాలాబాగా పని చేసిందని చెప్పుకొచ్చారు. రోబో కాఫీ ఇవ్వటం ఆయన్ను అమితంగా ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. కాఫీ ఇచ్చిన రోబో గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడటమే దీనికి నిదర్శనం. సింగపూర్ ఎయిర్ పోర్ట్ మొత్తం యంత్రాలతోనే పని చేస్తుందని.. అక్కడ మనుషులు పెద్దగా ఉండరని చెప్పుకొచ్చారు.
ఈసారి ఫారిన్ టూర్ లో బాబు మనసును అమితంగా ఆకట్టుకొని.. తీవ్రంగా ప్రభావితం చేసింది మాత్రం కాఫీ ఇచ్చిన రోబోనే అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. ఇంతగా ఆయన్ను ఆకట్టుకున్న కాఫీ రోబోను.. ఏపీ సీఎంవోలో ఏర్పాటు చేస్తారా? లేదా ఇంకెక్కడైనా ఏర్పాటు చేస్తారో చూడాలి.