ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పంద్రాగస్టు సందర్భంగా పట్టిసీమ పైలాన్ ను ప్రారంభించి ఏపీలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. గోదావరి-కృష్ణా రెండు పెద్ద నదుల అనుసంధానంతో ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టినట్లయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ వల్ల వేలాది ఎకరాలకు సాగునీరేగాక రాయలసీమకు తాగునీరు కూడా అందుతుందన్నారు.
పట్టిసీమతో పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం అటకెక్కిస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన కొట్టి పడేశారు. 2018 కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామని... పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో రాష్ర్టాన్ని కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో పట్టిసీమ పైప్ లైన్ ఆపరేట్ చేస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే పట్టిసీమ వల్ల ఉభయగోదావరి జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం జరగదని...ఈ రెండు జిల్లాలకు తాను ఎన్నటికీ అన్యాయం చేయనని ఆయన చెప్పారు. ఈ రెండు జిల్లాల ప్రజలు ఇచ్చిన మెజార్టీ సీట్ల వల్లే తాను ఈ రోజు అధికారంలో ఉన్నానని... గోదావరి జిల్లాల ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చంద్రబాబు తెలిపారు.
ఏదేమైనా ఈ పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ముందునుంచి చెప్పినట్టుగానే శరవేగంగా పనులు పూర్తి చేసి ఆగస్టు 15నే ప్రారంభించారు. చాలా చోట్ల కొన్ని పెండింగ్ పనులు ఉన్నా వాటిని కూడా శరవేగంగా ముగించేస్తున్నారు. ఈ నెల చివరకు ఆ పనులు కూడా పూర్తవుతాయి. ఈ ఎత్తిపోతల పథకంలో గోదావరి మిగులు జలాలను భారీగా వాడుకోవచ్చు.