మనిషి మారలేదు.. అచ్చం అప్పటి మనిషే.. అవే నిర్ణయాలు.. అదే ఒంటెద్దు పోకడ.. అదే హైటెక్ హంగులు.. ఏపీ సీఎం చంద్రబాబు ఏమాత్రం మారలేదు.. 1999 ఎన్నికల్లో అధికారం చేపట్టాక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో - ఎలాంటి పద్ధతులు అవలంభించారో అవే ఇప్పటికీ పాటిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రతి వేదికపైనా చంద్రబాబు చెప్పిన మొదటి మాట నేను మారాను.. నేను మారాను. అంటే గతంలో తాను తప్పులు చేశాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. 1999లో అధికారం చేపట్టాక ప్రభుత్వ యంత్రాంగాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. బాబోయ్ చంద్రబాబు పాలనా అనే విధంగా గుక్క తిప్పుకోకుండా గుటకలు మింగించారు. అదే విధంగా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు. మహిళలు - బీసీలు ఇలా అన్ని వర్గాలనూ చిన్నచూపు చూశారు. వీరందరి ఆగ్రహంతోనే 2004లో టీడీపీ అడ్రస్ గల్లంతైంది.
విజయవాడలోకి కృష్ణానదిలో ప్రపంచ స్థాయి బోట్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. దేశ - విదేశాల నుంచి రేసర్లను పిలిపించారు. కోట్ల రూపాయలు ధార పోస్తున్నారు. దేశమంతా తెలిసేలా తన అనుకూల మీడియా ద్వారా ఊదర గొడుతున్నారు. తానేదో గొప్ప ఘనత సాధించినట్లు తనకు తానే పొగిడేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం కృష్ణా కుడి కాలువ పరిధిలో పంటలు నీళ్లు లేక ఎండు ముఖం పట్టాయి. ఇప్పటికే వారబందీతో అరకొర నీటితో పంటలు చేతికందే పరిస్థితి లేక రైతుల గుండెలు కన్నీరొలుకుతున్నాయి. వీటన్నింటినీ పట్టించుకోని చంద్రబాబు.. హడావుడిగా బోట్ రేసింగ్ కు అవసరమైన నీటిని కృష్ణా కుడి కాలువ నుంచి మళ్లించారు. దీని కోసం పంటలకు విడుదల చేయాల్సిన నీటిని ఆపేశారు. ఇది తెలిసిన రైతాంగం చంద్రబాబు తీరుపై నిప్పులు కక్కుతోంది.
ఇప్పటికీ హైటెక్కు బాబే..
2003 వరకు హైటెక్ సిటీ అంటూ టక్కుటమారా విద్యలతో మ్యాజిక్ లు చేసిన చంద్రబాబు.. 2004లో హైదరాబాద్ లో గోల్ఫ్ కోర్టు నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చించారు. అప్పటికే తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో కరువుకాటకాలతో ప్రజలు అల్లాడిపోయి ఉన్నారు. వీరి గురించి పట్టించుకోని బాబు గోల్ఫ్ కోర్టుకు కోట్ల రూపాయలు వెచ్చించడంపై ప్రజలు మండిపడ్డారు. అన్ని వర్గాల నుంచి విమర్శల బాణాలు సూదుల్లా గుచ్చాయి. ఇవన్నీ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంలా మారి టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోశాయి. అనంతరం పదేళ్లపాటు అధికారానికి దూరం చేసినా బాబు తీరులో మాత్రం మార్పు రాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పడు బోట్ రేసింగ్ కోసం రైతులకు అందాల్సిన నీటిని మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు లేక విద్యార్థులు - నీళ్లు లేక అన్నదాతలు - రుణమాఫీగాక డ్వాక్రా మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే.. ఇప్పుడు బోట్ రేసింగ్ లు ఏంటని ప్రతిపక్షాల నేతల విమర్శిస్తున్నారు. అప్పట్లో గోల్ఫ్ కోర్టుతో సెల్ఫ్ గోల్ వేసుకున్న బాబు.. 2019 ఎన్నికల్లో సైతం బోట్ రేసింగ్‌ల పేరిట విదేశీ సంస్కృతి వెంట పడి తనకు తానే అధికారాన్ని దూరం చేసుకుంటాడని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు.