ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చటం అంత తేలికైన వ్యవహారం కాదు. అందులోకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు అంత సింఫుల్ కాదు. రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఆ హామీని నిలబెట్టుకోవటానికి.. తొలి క్యాంటీన్ ను షురూ చేయటానికి రెండేళ్లకు పైనే ఎక్కువ కాలం పట్టిన పరిస్థితి.
తాజాగా ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.5లకే అందించే భోజనాన్ని పలువురికి స్వయంగా వడ్డించి.. మనసు దోచుకున్నారు. అతి తక్కువ ధరలకే టిఫెన్లను అందించే అన్నా క్యాంటీలన్లను పెద్ద ఎత్తు ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతారు.కానీ.. వాటిని ఏర్పాటు చేయటానికి ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారని చెప్పాలి.
తాజాగా ఓపెన్ చేసిన అన్న క్యాంటీన్ లో భోజనాన్ని పలువురికి తానే స్వయంగా వడ్డించిన చంద్రబాబు.. తాను సైతం ఈ భోజనాన్ని తానే స్వయంగా వడ్డించుకొని రుచి చూశారు. భోజనం నాణ్యత బాగుందంటూ కితాబు ఇచ్చారు. దశల వారీగా ఈ తరహా క్యాంటీన్లను రాష్ట్రం మొత్తం వ్యాపించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అయితే.. ఇలా ప్రారంభించిన రోజున రూ.5 భోజనాన్ని టేస్ట్ చూడటం పెద్ద విషయం కాదనే చెప్పాలి. ఎందుకంటే.. ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే.. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా.. ఆకస్మికంగా తనిఖీలు చేసి ఫుడ్ ను టేస్ట్ చేస్తే మరింత బాగుంటుంది. అప్పుడే రూ.5 భోజనం అసలు రంగు బయటపడుతుంది. మరి.. ఆ పని చంద్రబాబు చేస్తారా..?