ఎన్నిక‌ల త‌ర్వాత బాబు మాట ఇదేనా?

Update: 2018-12-04 12:07 GMT
హైద‌రాబాదు ఎవ‌రు క‌ట్టారు? అని అడిగితే నేనే నంటాడు.
మ‌రీ కులీకుతుబ్ షా  ఎవ‌రంటే...
ఆయ‌న హైద‌రాబాదు కట్టాడు... నేను ప్ర‌పంచ ప‌టంలో పెట్టాను అంటాడు.

ఇది చంద్ర‌బాబు తీరు. ఏద‌యినా స‌క్సెస్ అయితే... ఆ క్రెడిట్ తీసుకోవ‌డంలో ఆయ‌న ముందుంటారు. ఏకంగా స‌త్య నాదెళ్ల వంటి వారు ఎద‌గ‌డానికి కూడా త‌నే కార‌ణం అని కూడా చెప్పుకుంటార‌ట బాబు గారు. ఇప్ప‌టికే దేశంలో ప్రజా కూట‌మి బీజేపీకి వ్య‌తిరేకంగా ఏర్పాటుచేశాను అని చెబుతున్న చంద్ర‌బాబు... మ‌రి వారెందుకు నీ వ‌ద్ద‌కు రావ‌డం లేదంటే ఆయ‌న వ‌ద్ద స‌మాధానం ఉండ‌దు. బాబు ఎవ‌రినీ కొత్త‌గా క‌లిపింది లేదు... కాంగ్రెస్ కూట‌మిలో ఉన్న‌వాళ్లంద‌రూ పాత‌వాళ్లే... బాబు వాళ్ల‌తో కొత్త‌గా క‌లిశాడంతే... కేజ్రీవాల్ ను క‌లుదామ‌ని ట్రై చేసి విఫ‌ల‌మ‌య్యాడు. ఇటీవలే కాంగ్రెస్‌తో క‌లిసేది లేదు... ఢిల్లీలో బీజేపీని ఓడించి 7 లోక్‌స‌భ సీట్లు గెలుస్తుంది *ఆప్* అని అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు విని బాబు ఖంగుతిన్నాడు.

ఇక తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ ఉనికి చాటుకోవ‌డానికి కాంగ్రెస్‌తో క‌లిసిన బాబు... ఇపుడు తానే ప్ర‌జాకూట‌మిని న‌డుపుతున్న‌ట్టు మీడియాలో ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఒక‌వేళ ప్ర‌జాకూట‌మి నెగ్గితే... త‌న వ‌ల్లే నెగ్గింది అని చెప్పుకోవ‌డానికి బాబు ఏమాత్రం వెనుకాడరు. ఒక‌వేళ ఓడితే... కాంగ్రెస్‌లోని అంత‌ర్గ‌త గొడ‌వలు కూట‌మికి తీవ్ర న‌ష్టం చేశాయి. అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ కాంగ్రెస్ త‌ప్పు చేసింద‌ని అనేయ‌గ‌లిగిన స‌మ‌ర్థుడు బాబు. కాంగ్రెస్ ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే ఏపీలో వారి పొత్తు ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రిస్తాం... పార్టీ ప్ర‌జాస్వామ్య‌యుతంగా న‌డ‌వ‌డంలేదు, అంత‌ర్గ‌త గొడ‌వ‌ల‌తో వారు నాశ‌న‌మై మ‌మ్మ‌ల్ని నాశ‌నం చేశారు. అద్భుత‌మైన అవ‌కాశం ఇస్తే దుర్వినియోగం చేశారు. ఏపీలో క‌చ్చితంగా వీరితో క‌ల‌వ‌డంపై పున‌రాలోచిస్తాం అన‌డానికి బాబు ఏ మాత్రం సంశ‌యించ‌డు.

మ‌రి ఓట‌మిని కాంగ్రెస్ మీద నెట్టేసి టీఆర్ఎస్ గెలుపును ఏమ‌ని స‌మ‌ర్థిస్తారో తెలుసా... ప్ర‌భుత్వ మార్పును ప్ర‌జ‌లు కోరుకోవ‌డం లేదు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో, ఒడిసాలో, ఇక్క‌డా ఇలాగే జ‌రిగింది... రేపు ఏపీలో కూడా ఇదే జ‌రిగిపోతుంది. కేసీఆర్ ప‌నులు మొద‌లుపెట్టారు...ఇంకా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో రాలేదు. ఆయ‌న‌కే అంత ఆద‌ర‌ణ ఉంటే నదుల అనుసంధానం పూర్తి చేయ‌డంతో పాటు ఎన్నో అభివృద్ధి ప‌నులు చేసిన మాకే మ‌ళ్లీ ప‌ట్టం క‌డ‌తార‌ని ఈ ఎన్నిక‌లు నిరూపించాయంటారు. యుట‌ర్న్ లు  బాబుకు కొత్తేం కాదు క‌దా!
Tags:    

Similar News