కోడెల మరణంపై గవర్నర్ వద్దకు బాబు

Update: 2019-09-19 11:13 GMT
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వద్దకు వెళ్లారు. కోడెల మరణంతోపాటు టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. రాజకీయ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారని గవర్నర్ బీబీ హరిచందన్ కు విన్నవించారు. చిన్న కారణాలకు సైతం పెద్ద కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు చేశారు.

చంద్రబాబుతోపాటు నారా లోకేష్, చినరాజప్ప, దేవినేని ఉమా, బుద్ద వెంకన్న, కరణం బలరాం, అశోక్ బాబు, కళా వెంకట్రావ్, నిమ్మల, ఆనందబాబు, వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్ తదితరుల టీడీపీ బృందమంతా గవర్నర్ వద్దకు వెళ్లి దాదాపు 13 పేజీల నివేదికను అందజేశారు. అక్రమ కేసులతో టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు చేస్తున్న తీరును వివరించారు.

వైసీపీ అధికారం చేపట్టిన 3 నెలల కాలంలోనే జరుగుతున్న దాడులు ఇవీ అంటూ గవర్నర్ హరిచందన్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. కోడెల ఆత్మహత్యకు కారణాలు, ప్రభుత్వ వేధింపులు - టీడీపీ నేతలు - కార్యకర్తలపై అక్రమ కేసుల లిస్ట్ ను ఆ 13 పేజీల నివేదికలో పొందుపరిచి చొరవ తీసుకొని ప్రతిపక్షంపై దాడులను అరికట్టాలని గవర్నర్ హరిచందన్ ను చంద్రబాబు కోరారు.
    

Tags:    

Similar News