బాబు....నోరు విప్ప‌వా?

Update: 2015-08-28 12:16 GMT
తెలుగుదేశం అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై మౌనంపై రాజ‌కీయ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యంతో పాటు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. ఏపీకి ప్ర‌త్యేకహోదా విష‌యంలో అనుస‌రించిన వైఖ‌రి నే స్మార్ట్ సిటీల విష‌యంలోనూ చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆంధ్రులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. చంద్ర‌బాబుత‌న మౌనాన్ని లౌక్యం అనుకోవ‌డం స‌రికాద‌ని...అన్ని విష‌యాల్లోనూ తాపీగా నిర్ణ‌యం తీసుకుంటూ పోతుంటే... పుణ్య‌కాలం గ‌డిచిపోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ హామీ ఇచ్చిన కేంద్రప్ర‌భుత్వంలో గ‌ద్దెనెక్కినా బాబు స్పెష‌ల్ స్టేట‌స్‌పై గట్టిగా నిల‌దీయ‌లేదు. ఎలాగైనాహోదా ద‌క్కుతొంద‌ని ఒక స్థాయికి మించిన భ‌రోసా ప్ర‌ద‌ర్శించారు. అయితే కేంద్రప్ర‌భుత్వం పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌త్యేక హోదా లేద‌ని తేల్చింది. త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డినచంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ని క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ విన్న‌వించుకున్నారు. అయితే మోడీ నో చెప్పార‌ని తెలుస్తోంది.క‌నీసం బీహార్‌కు ఇచ్చిన‌ట్లు భారీ ప్యాకేజీ అయినా ఇవ్వ‌మ‌ని కోరితే...దానికి మోడీసై అన‌లేదు స‌రిక‌దా..ఆర్థిక‌మంత్రి జైట్లీ పొడిపొడిగా స్పందించి పంపించారు.ఆఖ‌రుకు ఏమైందంటే... విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వాటిని నెర‌వేరుస్తామ‌ని కేంద్రంచెప్ప‌డం..వాటికోసం గ‌ట్టిగా పోరాడుతామ‌ని బాబు దీర్ఘాలు తీయ‌డంతోస‌రిపోయింది!

కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌ నాయుడును అవ‌కాశం దొర‌కిన‌ప్పుడల్లా కీర్తించే చంద్ర‌బాబు స్మార్ట్ సిటీల విష‌యంలో ఎందుకు క‌న్వీన్స్ చేయ‌లేక‌పోయారు? చ‌ంద్ర‌బాబుచెపితే వెంక‌య్య‌ నాయుడు విన‌రా?  పోనీ... కేంద్ర ప్ర‌భుత్వం త‌నకు ఎంతో గౌర‌వంఇస్తుంద‌ని ప్ర‌చారం చేసుకునే బాబు ఇపుడెందుకు ఆ ప‌ని చేయ‌లేక‌పోతున్నారు?అనే సందేహాలు ఆంధ్రుల‌కు క‌ల‌గ‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు.

ఎందుకంటే...స్మార్ట్ సిటీల‌ను ద‌శ‌ల‌వారిగా అభివృద్ధి చేయ‌నున్నారు. ఇందుకోసంమొద‌ట ప్ర‌కటించిన 100 న‌గ‌రాల మ‌ధ్య పోటీ నిర్వ‌హించి 20 న‌గ‌రాల‌నేఎంపిక‌చేయ‌నున్నారు. ఈ ఎంపిక కోసం వారు పెట్టిన ష‌ర‌తుల ప్ర‌కారం న‌గ‌రాల‌నుఅభివృద్ధి చేయాలి. అలా చేయాలంటే నిధులు కావాలి. ఇప్ప‌టికే ఏపీ ఆర్థిక క‌ష్టాల్లోఉంది కాబ‌ట్టి..స్మార్ట్ న‌గ‌రాల కోసం ఖ‌ర్చు చేసే సొమ్ములు దాదాపుగా క‌ష్టమే. ఈనేప‌థ్యంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. అలా తేవాలంటే క‌చ్చితంగా కేంద్రంతో మాట్లాడాలి. అవ‌స‌ర‌మైతే డిమాండ్ కూడా చేయాలి.లేనిప‌క్షంలో....మొద‌టి ద‌శ‌లో ఎంపిక‌య్యే న‌గ‌రాల్లో ఏపీ నుంచి అవ‌కాశం ద‌క్కినమూడు న‌గ‌రాలు అవ‌కాశం ద‌క్క‌క అక్క‌డే ఉండిపోవాల్సి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలోచంద్ర‌బాబు నోరు విప్ప‌డం ఎంతైనా అవ‌స‌రం. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గ‌ట్టిగా అడ‌గ‌లేకుండా తప్పు చేసిన‌ట్లే చంద్రబాబు ఇప్పుడు కూడా చేస్తేమిగిలిదే న‌ష్టం త‌ప్ప మ‌రేమీ కాదు.

మ‌రోవైపు చంద్ర‌బాబు పొరుగు రాష్ర్టం తెలంగాణ‌ను చూసి  పోరాట స్పూర్తిని సాధించుకోవాలని సూచిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులను చూసి అయినాఅన్యాయం జరుగుతుంటే స్పందించే తీరుపై పాఠాలు నేర్చుకోవానలి అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగేలా ఏ ప్రకటన వెలువ‌డినాటీఆర్ఎస్ నేత‌లు వెంట‌నే స్పందిస్తారు. కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తారు. కానీచంద్ర‌బాబు లేదా టీడీపీ నేత‌లు ఆ  ప‌ని చేయ‌లేక‌పోతున్నారు. దీన్ని మైత్రిబంధంఅని బాబు ఆండ్ టీమ్ చెప్పుకోవచ్చు. కానీ.. ఈ గౌరవానికి తగినట్లు . కేంద్రంపెద్ద‌గా గౌర‌వించిన దాఖ‌లాలు లేవు. అలాంట‌పుడు ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల ముఖ్యంత‌ప్ప పార్టీల మెప్పుకోసం ప‌నిచేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు రావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

మోడీ స‌ర్కారుకు పూర్తి బ‌లం ఉన్నందున టీడీపీ మ‌ద్ద‌తు అవ‌స‌రం లేదు. ఈనేప‌థ్యంలో బీజేపీ టీడీపీకి పెద్ద‌గా గౌర‌వం ఇవ్వాల్సిన ప‌నిలేదు. దీన్ని టీడీపీ,చంద్ర‌బాబు గ్ర‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. అలా అని బీజేపీతో తెగ‌తెంపులుచేసుకోవాల‌ని కోరుకోవ‌డం లేదు. కాక‌పోతే ఎన్నిక‌లున్న బీహార్‌కు ప్యాకేజీప్ర‌క‌టించ‌డం... త‌మిళ‌నాడు సీఎంను సంతృప్తిప‌రిచేందుకు పెద్ద సంఖ్య‌లో స్మార్ట్ సిటీలు ప్రకటించ‌డం వంటి ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు కేంద్రంపాల్ప‌డుతుండ‌గా...చంద్రబాబు ఓపిక పట్ట‌డం ఎందుక‌నేది కామ‌న్ క్వ‌శ్చ‌న్‌.

 
Tags:    

Similar News