ఆరింటిలో బాబు ఉండే బిల్డింగ్ ను తేల్చేశారు

Update: 2016-06-08 04:50 GMT
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విధులు నిర్వర్తించే కార్యాలయాన్ని డిసైడ్ చేశారు. మొత్తం ఆరు భవనాలుగా నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో మొదటి కార్యాలయాన్ని చంద్రబాబుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27నాటికి హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని అమరావతికి తరలించాలన్న కృతనిశ్చయంతో ఏపీ సర్కారు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాత్కాలిక సచివాలయంలోని ఆరు భవనాల్ని ఎవరెవరికి ఏఏ భవనాలు కేటాయించాలన్న అంశంపై కొద్దిరోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతోంది.

తాజాగా ఈ ఆరుభవనాల్లో ఎవరికి ఏ ఏ భవనాల్ని కేటాయించాలన్న అంశంపై స్పష్టం వచ్చింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మొదటి భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకి కేటాయించనున్నారు. ఆ భవనంలోనే ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉండనుంది. ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ ల సాధారణ పరిపాలన శాఖ కోసం 23వేల చదరపు అడుగులు.. న్యాయశాఖకు 6850 చదరపు అడుగులు కేటాయించనున్నారు. ఈ భవనంలోనే ముఖ్యమంత్రి సమావేవాలకు వీలుగా సమావేశ హాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇక.. 2..3.. 4 భవనాల్లో మంత్రుల కార్యాలయాలు ఉండనున్నాయి. ఈ మూడింటిలో మూడో బిల్డింగ్ లో ఉద్యోగులకు సంబంధించిన సాధారణ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. టెలికాం ఆఫీస్ తో పాటు.. పిల్లల సంరక్షణకు వీలుగా క్రెష్.. ప్లే స్కూల్.. డిస్పెన్సరీ లాంటివి ఉండనున్నాయి. ఇక.. ఆరో బిల్డింగ్ లో శాసనసభ.. శాసనమండలి కోసం కేటాయించారు. తాజా కేటాయింపుల నేపథ్యంలో ఎవరెవరి కార్యాలయాలు ఎక్కడెక్కడా అన్న విషయంపై స్పష్టత వచ్చేసినట్లేనని చెప్పాలి.

 
Tags:    

Similar News