అమిత్‌ షా వి అబ‌ద్దాలు స‌రే..నిజాలు ఏవి బాబు?

Update: 2018-03-24 12:41 GMT
క‌ల‌హాల కాపురంగా సాగి..ఇటీవ‌లే దోస్తీకి టాటా చెప్పిన టీడీపీ-బీజేపీల మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేయ‌క‌పోయినా...భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలపై ఇరు ప‌క్షాల మ‌ధ్య‌ రగడ కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు రాసిన బ‌హిరంగ లేఖ ఈ వివాదాన్ని తారాస్థాయికి తీసుకుపోయింది. స‌హ‌జంగా షా ఎదురుదాడి చేశారు. తామేం చేశామో ఏక‌రువు పెట్టారు. దీనిపై అంతే స‌హ‌జంగా చంద్ర‌బాబు త‌ప్పుప‌ట్టారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని, ఈశాన్య రాష్ట్రాలకు అన్నీ ఇస్తున్నారు కానీ ఏపీకి ఏమి చేయడం లేదని ఏపికి ఒక రూల్..ఇతర రాష్ట్రాలకు మరొక రూలా అని ప్రశ్నించారు. షా లేఖ‌లో అన్నీ అబ‌ద్దాలు ఉన్నాయంటూ...ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెబుతారా ? అంటూ బాబు గుస్సా అయ్యారు.

ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే తాను ఎంత పోరాటం చేశామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు.  రావాల్సినవి అడుగుతుంటే ఎదురుదాడి చేస్తున్నారని, కేంద్ర మంత్రులు అస‌త్యాలు ఎందుకు చెబుతున్నార‌ని నిల‌దీశారు. రాష్ట్ర హ‌క్కుల‌పై కేంద్ర మంత్రుల‌కు చాలా లేఖ‌లు రాశామ‌ని, ఢిల్లీకి కూడా ఎన్నోమార్లు వెళ్లడం జరిగిందని, కష్టాలపై తాను సవివరంగా చెప్పడం జరిగిందన్నారు. రావాల్సినవి అడుగుతుంటే ఎదురుదాడి చేస్తున్నారని, కేంద్ర మంత్రులు అస‌త్యాలు ఎందుకు చెబుతున్నార‌ని నిల‌దీశారు.మిత్ర పక్షంగా చేయాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వం చేయలేదని బాబు వ్యాఖ్యానించారు.

అయితే చంద్ర‌బాబు ప్ర‌సంగం కొత్త సందేహాల‌ను లేవ‌నెత్తుతుంద‌ని అంటున్నారు. అమిత్ షా లేఖ‌లో త‌ప్పులు ఉన్నాయ‌ని బాబు చేస్తున్న ఎదురుదాడిలో నిజం ఉంటే అదే విష‌యాన్ని ఆధారాల‌తో స‌హా ప్ర‌జ‌ల ముందు ఎందుకు ఉంచ‌లేద‌ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. గ‌ణాంకాలు, రికార్డులు వంటి డాటా విష‌యంలో ముందుడే టీడీపీ...బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అంకెల‌తో స‌హా వివ‌రించిన‌ప్ప‌టికీ ఎందుకు రావాల్సిన‌వి ఇవి..వ‌చ్చినవి ఇవి..చ‌ట్టంలో ఉన్న‌వి ఇవి...అధ‌నంగా ఇచ్చిన‌వి ఇవి అనే వివ‌రణాత్మ‌క స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డంలో మొహమాటం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News