ఫారిన్ టూర్లతో ప్రయోజనం లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో వ్యక్తమవుతోంది. కాకపోతే ఆయన ఫారిన్ టూర్లు వృథా అంటున్నది తన టూర్ల గురించి కాదు. అధికార్లు వెళుతున్న వాటి గురించి తొమ్మిది రోజుల విదేశీ పర్యటన తర్వాత ఆయన అమరావతిలో అధికార యంత్రాంగంతో సమావేశమైనప్పుడు.. ఆయనకు ఇలాంటి అభిప్రాయం కలిగిందన్నమాట. అధికారులతో సమీక్షిస్తున్న సందర్భంలో చంద్రబాబు ఫారిన్ టూర్ల ప్రస్తావనపై అసహనానికి లోనయ్యారు. కలెక్టర్లను - మంత్రులను విదేశీటూర్లకు పంపితే కాసింతైనా మార్పులేదని చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. అభివృద్ధి పనుల్లో కళాశాల - విశ్వవిద్యాలయ విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు మార్గదర్శకాలు సిద్ధంచేయాలనే ఆదేశాలను ఎవ్వరూ పట్టించుకోలేదని విచారం వ్యక్తంచేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు - ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ దాస్ లు ఇంకా విదేశీ పర్యటనలో ఉన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఫారిన్ టార్ల తీరూతెన్నుపై విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ ఎవర్నైనా ఫారిన్ పంపించాలంటే భయమేస్తోంది. ఖర్చుతో కూడుకున్న పనైనప్పటికీ మన వాళ్లలో మార్పువస్తుంది. ఫలితాలను రాబట్టవచ్చనుకుంటే... పదిమందిలో కనీసం ముగ్గురిలోకూడా మార్పు కానరావడంలేదని విచారం వ్యక్తంచేశారు. అధికారుల తీరుపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. క్షేత్ర స్థాయిలో ఏంజరుగుతుందో తెలియదు. క్షేత్రస్థాయికెళ్లి పనిచేయకుండా ఇక్కడకూర్చొని మాట్లాడితే లాభం లేదని మండిపడ్డారు.
ఫారిన్ టూర్ కెళ్లి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించి తొలిసమీక్ష సమావేశంలో ఫారిన్ టూర్లతో ప్రయోజనం లేదని నిర్ణయానికి రావడం అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఫారిన్ టూర్లతో ప్రయోజనం లేనపుడు కోట్లకుకోట్లు విదేశీ యాత్రల పేరుతో ఖర్చుపెట్టడమేంటనే ప్రశ్నకు సమాధానం దొరకదు. సాదారణంగా విద్యార్థి సంవత్సరమంతా చదివితే వార్షిక పరీక్షలు రాయగా కనీసం 35 మార్కులొస్తే ఉత్తీర్ణుడవుతాడు. అయితే విదేశీయాత్రకు పంపిన మంత్రులుగానీ - అధికారులు గానీ కనీసం 30 శాతంలోకూడా మార్పు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రస్తావనకు తీసుకురావడం చర్చనీయాంశమైంది. పాలనలో ఏ మేరకు సఫలమవుతున్నామని చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అమరావతి లో భవంతుల నిర్మాణానికి నమూనాల రూపకల్పనకు కోట్లకు కోట్లు ఖర్చవుతున్నాయి. పెట్టుబడులు ఆహ్వానిద్ధామని చంద్రబాబు నేతృత్వంలో అధికార యంత్రాంగం నిర్వహించిన ఫారిన్ టూర్లు కూడా ఎలాంటి ఫలితాలను సాధించలేదు. ఫారిన్ టూర్లతో సాధించేదేమీ లేదని ప్రజాధనం దుర్వినియోగమవుతోందని పాలకులకు ఆలస్యంగా బోధపడుతోంది. మరి భవిష్యత్తులో పాలకులు ఫారిన్ టూర్లపేరుతో విహారయాత్రలు చేస్తారా? ప్రగతి సాధనకు దోహదపడే మార్గాలను అన్వేషిస్తారో చూద్ధాం. అయినా చంద్రబాబు అధికార్ల ఫారిన్ టూర్లను తప్పు పడుతున్నారు గానీ.. ఆయన టూర్లు మాత్రం సాధిస్తున్నది ఏముంది? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.