టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అనుమానాలు లేకున్నా... రాజకీయాల్లో అపర చాణక్యుడిగా తనను తాను అభివర్ణించుకుంటున్న చంద్రబాబు.... ఇటీవలి కాలంలో ప్రతి విషయంలోనూ బోల్తా పడుతున్న వైనం చాలా స్పష్టంగానే కనబడుతోంది. గతంలో తనకు సమకాలీకులుగా భావించిన రాజకీయ నేతల వద్ద చంద్రబాబు వ్యూహాలు బాగానే పనిచేసినా... ఇటీవలి కాలంలో కొత్తగా తెర మీదకు వచ్చిన ప్రస్తుత రాజకీయాల వద్ద మాత్రం బాబు రాజకీయాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయన్న వాదన బాగానే వినిపిస్తోంది. మొత్తంగా తన సమకాలీకులు ప్రస్తుతం లేకున్నా... ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద మాత్రం చంద్రబాబు పాచికలు పారడం లేదు. అసలు రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడిలా తనను తాను అభివర్ణించుకునే చంద్రబాబు... ప్రస్తుత రాజకీయాల వద్ద ఎందుకు బోల్తా పడుతున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటుండటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయిందని చెప్పాలి.
అయినా చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ వద్ద నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన జగన్ లాంటి నేతలు ఎలా నెట్టుకురాగలుగుతున్నారన్న విషయానికి వస్తే... చంద్రబాబు తనకు తెలిసో - తెలియకో చేస్తున్న తప్పులే ఆయనను అడ్డంగా బుక్ చేస్తున్నాయని చెప్పక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ తరహాలో చంద్రబాబు ఇబ్బంది పడుతున్న వ్యవహారానికి సంబంధించి నేటి ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పుకోవాలి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు రసవత్తర రాజకీయం నడుస్తోందనే చెప్పాలి. వైసీపీ ఆది నుంచి ప్రత్యేక హోదా కోసం ఒకటే స్టాండ్ తో నడుస్తుండగా, గడచిన ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మొన్నటిదాకా తన స్టాండ్‌ను మార్చుకోలేదనే చెప్పాలి. అయినా ఈ విషయంలో జగన్ తన వ్యూహాన్ని మార్చుకోకుండానే పనిచేస్తున్నా... ఇటీవలి కాలంలో పవన్ ఒక్కసారిగా తన వ్యూహాన్ని మార్చుకుని టీడీపీకి దెబ్బేస్తూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం పక్కనపెడితే... అసలు మారిన రాజకీయాన్ని అంచనా వేయడంలో చంద్రబాబు అనుభవం ఎందుకూ కొరగాకుండా పోయిందని చెప్పక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
ఇక నేటి ఉదయం ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు అవసరమైన ఉద్యమాన్ని నడిపేందుకంటూ చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం...ఆయనకు పెద్ద దెబ్బే వేసిందని చెప్పాలి. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ, జనసేన, బీజేపీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించేశాయి. ప్రత్యేక హోదా వద్దే వద్దంటూ... కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి మరింత మేర లబ్ధి చేకూకుతుందని చెప్పిన చంద్రబాబు... ప్రత్యేక హోదా పేరెత్తితే కాల్చి పారేస్తానని కూడా ప్రకటించిన విషయం ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. అదే సమయంలో మొన్న కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావన లేకపోవడంతో ఉన్నపళంగా మాట మార్చేసిన చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని పక్కనపెట్టేసి... ప్రత్యేక హోదాను భుజానికెత్తుకున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వైసీపీ, జనసేన, బీజేపీ అఖిల పక్ష భేటీని బహిష్కరించేశాయి. అయితే సమావేశానికి హాజరవుతామని సమాచారం పంపిన వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజా సంఘాలైనా తన పోరాటాన్ని గుర్తిస్తాయి కదా అని చంద్రబాబు భావించారు. అయితే మీటింగ్ లో ఏం జరిగిందో తెలియదు గానీ... సమావేశం ముగియగానే బయటకు వచ్చిన వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు యధాలాపంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపైనే దాడికి దిగాయి.
ఈ అనూహ్య పరిణామంతో నిజంగానే చంద్రబాబు ఖిన్నుడైపోయాడని చెప్పాక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో పాటు చంద్రబాబు కూడా అన్యాయం చేస్తూనే వస్తున్నారని తాము ఆరోపించిన విషయాలు నేటి అఖిల పక్షభేటీతో తేలిపోయాయని అటు వామపక్షాలతో పాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పిలిచిన సమావేశానికి వెళ్లిన ఈ రెండు పార్టీల నేతలు... సమావేశం ముగియగానే చంద్రబాబు వైఖరినే తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం నిజంగానే టీడీపీ వర్గాలను షాక్‌కు గురి చేశాయనే చెప్పాలి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న నేతలకు ఓ ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదనే వాదన లేకపోలేదు. చంద్రబాబు వినిపించే వాదనే తమ వాదనగా సాగుతున్న టీడీపీ శ్రేణులు... ఒక్కసారిగా చంద్రబాబు పిలిచిన సమావేశానికే వచ్చిన కీలక పార్టీలు చంద్రబాబునే విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం నిజంగానే ఆ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ క్రమంలో ఇకపై చంద్రబాబు వ్యూహాలు ఏమాత్రం పార్టీకి పనికి వస్తాయోనన్న అనుమానాలను కూడా పార్టీ శ్రేణుల్లో రేకెత్తించాయని చెప్పక తప్పదు.