ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో తమ పార్టీ తెలుగుదేశం శవాసనం వేయకముందే కాపాడుకోవడానికి కాస్త సమయం వెచ్చించి.. గురువారం నాడు విస్తృతస్థాయిలో పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టుకున్నారు. అయితే ఈ సమావేశం ద్వారా ఆయన ఎలాంటి సంకేతాలను పార్టీకి అందించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా గానీ... వచ్చే ఎన్నికల సమయానికి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయంలో గానీ.. ఆయన ఎలాంటి సంకేతాలు ఇచ్చి పార్టీ శ్రేణులకు ఒక భరోసా అందించే ప్రయత్నం చేశారు.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలోని రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరిపోయే వరకు.. తెలంగాణ పార్టీ రోజురోజుకూ శిథిలమైపోతున్నదనే సంగతి తెలిసి కూడా సమయం వెచ్చించలేకపోయిన చంద్రబాబు ... చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఈ మీటింగు పెట్టారనే చర్చ కూడా సాగుతోంది. ఇదంగా ఒక ఎత్తు అయితే.. ఆయన ప్రసంగాంశాలను విడివిడిగా గమనించాల్సిన అవసరం ఉంది.
తెరాస తో పొత్తులుంటాయని పలురకాల ప్రచారం జరుగుతన్న సమయంలో చంద్రబాబు ఆ వాదనను ఖండించకపోవడం విశేషం. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలో నాకు వదిలేయండి.. రాజకీయాల్లో ఏం చేయబోతున్నామో ముందే చెప్పి చేయడం మంచిది కాదు అంటూ ఇప్పటికీ డొంక తిరుగుడుగానే మాట్లాడుతున్నారు.
అదే సమయంలో భాజపాతో పొత్తుపై మాత్రం అది కుదరని పని అన్నట్లుగా తేల్చేయడం విశేషం. భాజపాతో అంటుకట్టిన పార్టీగా కేంద్రంలో భాగస్వామ్య హోదాలో మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్న తెలుగుదేశం అధినేత.. భాజపాతో పొత్తులపై సందిగ్ధం ఉందని చెప్పడం కీలకాంశమే. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో భాజపాతో ఉన్న పొత్తులపై కూడా ఖచ్చితంగా పడుతుంది. అసలే చంద్రబాబు నోటినుంచి ఎలాంటి ప్రతికూల మాట వచ్చినా ఢిల్లీకి దానిని మోసుకెళ్లి ఏపీలో ఉన్న బంధాన్ని పుటుక్కు మనిపించడం కోసం పనిచేస్తున్న కోటరీ ఒకటి ఉంది. వారు ఈ మాటను సద్వినియోగం చేసుకోవచ్చు.
అలాగే.. రమణ నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా అంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పడం... పైకి చాలా అందంగా హుందాగా కనిపించవచ్చు. కానీ.. ఆ మాటల అంతరార్థం వేరే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాలు ఎలాంటి మలుపులు తిరిగినా, సమస్యలు ఎదురరైనా మీరూ మీరూ తేల్చుకోండి. నాదాకా తేవద్దు అని హెచ్చరించినట్లుగా ఈ మాట ఉన్నదని పలువురు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు ‘నా దాకా తేవొద్దు, మీరే తేల్చుకోండి’ అని గతంలో చాలా సార్లు అన్నారు. దాని పర్యవసానమే ఇప్పుడు రేవంత్ నష్టం. అందుకే ఈసారి జాగ్రత్తగా ఆ మాట వాడకుండా.. మరో స్టయిల్లో అదే మాట చెబుతున్నారన్నమాట. మొత్తానికి ఇప్పుడు ఆయనలో చలనం వచ్చింది గానీ.. ముందే మేలుకుని ఉంటే పార్టీ ఇంకా బాగుండేదిగా అని పలువురు అంటున్నారు.