గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం గురువారం నుంచి హైదరాబాద్ లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మీద తెలంగాణ అధికారపక్షం చేస్తున్న విమర్శలకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తావించటమే కాదు.. సూటిగా సమాధానం ఇస్తుండటం గమనార్హం. తాను హైదరాబాద్ విడిచి వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తున్న టీఆర్ ఎస్ నేతల మాటలకు చంద్రబాబు స్పందిస్తూ.. తాను హైదరాబాద్ ను విడిచి పెట్టి వెళ్లలేదని స్పష్టం చేస్తున్నారు.
తాజాగా మరోసారి ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు.. తాను హైదరాబాద్ నుంచి పారిపోలేదని.. పరిపాలన సౌలభ్యం కోసం అమరావతికి వెళ్లినట్లు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా.. వారికి ఎలాంటి సమస్య ఉన్నా తాను వాలిపోతానని గురువారం నాటి ప్రచారం సందర్భంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. తాజాగా మరో అడుగు ముందుకేసి.. తనపై చేస్తున్న విమర్శలకు బదులివ్వటం గమనార్హం.