మన సొమ్ములు విదేశాలకు.. బడ్జెట్‌లో ఎంత కేటాయించారంటే!
మిత్ర దేశాలకు సాయం చేయడం అనేది విధిగా జరిగిపోతోంది. ఇలా.. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనూ మిత్ర దేశాలకు మన సొమ్ములు కేటాయించారు.
భారత దేశ ప్రజలు కట్టే పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని కేవలం దేశ ప్రజలకు, అభివృద్ధికి, ప్రాజెక్టులకు కేటాయించడమే కాకుండా.. ఇరుగు పొరుగు దేశాలకు కూడా సాయం చేయడం.. భారత దేశం కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానం. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. మనకు సాయం చేసిన, లేదా మన నుంచి విడిపోయి చిన్నా చితకా దేశాలుగా ఏర్పడిన వాటికి ఏటా మన దేశం సాయం అందిస్తూనే ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ.. మిత్ర దేశాలకు సాయం చేయడం అనేది విధిగా జరిగిపోతోంది. ఇలా.. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనూ మిత్ర దేశాలకు మన సొమ్ములు కేటాయించారు.
ఈ ఏడాది 5.483 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మిత్ర దేశాలకు కేటాయించారు. వీటిలో చిన్న దేశాలతోపాటు.. మధ్య తరహా దేశాలు కూడా ఉన్నాయి. వీటికి వందల కోట్లలో కేటాయింపులు జరిపారు. ఆయా దేశాల కు ఈ సొమ్ములు సాయం కింద అందిస్తారు.
ఇవి తిరిగి చెల్లించే విధానంలో కాకుండా.. దేశాల మధ్య స్నేహం, ఆర్థిక సాయం ప్రాతిపదికగా జరిగే చెల్లింపులు. ఈ ఏడాది ప్రకటించిన సాయంలో ఇటీవల భారత్‌పై నిప్పులు చెరిగిన మాల్దీవులు కూడా ఉండడం విశేషం. అదేవిధంగా అఫ్ఘానిస్థాన్ కూడా ఉంది. ఈ నిధులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టే ప్రాజెక్టులకు, పేదరిక నిర్మూలనకు వినియోగిస్తారు.
ఏయే దేశాలకు ఎంతెంత?
+ అతి చిన్న దేశం భూటాన్ కు రూ.2,150 కోట్లు
+ మాల్దీవులకు రూ. రూ.600 కోట్లు
+ అఫ్ఘానిస్థాన్‌కు రూ.100 కోట్ల సాయం.
+ మయన్మార్‌కు రూ.350 కోట్లు
+ నేపాల్‌కు రూ.700 కోట్లు
+ శ్రీలంక దేశానికి రూ.300 కోట్లు
+ పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు రూ.130 కోట్లు
+ ఆర్థికంగా అనిశ్చితిని ఎదుర్కొనే ఆఫ్రికా దేశాలకు రూ.225 కోట్లు
+ మంగోలియాకు రూ.5 కోట్లు బడ్జెట్‌లో ప్రకటించారు.