యాదృచ్ఛికం: మౌనంగా ఉండే ఆ ఇద్దరు అధినేతలు ఒకే రోజు మాట్లాడటమా?

యాదృచ్ఛికం కం కాకతాళీయంగా అనూహ్య పరిణామానికి.. రాజకీయ కలకలానికి తెర తీశారు ఇద్దరు రాజకీయ అధినేతలు.;

Update: 2025-02-01 08:30 GMT

యాదృచ్ఛికం కం కాకతాళీయంగా అనూహ్య పరిణామానికి.. రాజకీయ కల కలానికి తెర తీశారు ఇద్దరు రాజకీయ అధినేతలు. ఈ ఇద్దరికి చాలానే సారూప్యతలున్నాయి. అదే సమయంలో ఆ ఇద్దరు ఉప్పు.. నిప్పుగా ఉంటారు. తరచి చూస్తే.. ఇద్దరి వ్యవహారశైలిలోనూ ఒకలాంటి అహంకారం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇద్దరే.. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ.. మరొకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిత్రంగా ఈ ఇద్దరు నేతలు చేతిలో అధికారం ఉన్నప్పుడే కాదు.. అధికారం లేనప్పుడు కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటారు. ప్రజలకు దూరంగా ఉంటూ.. తాము అనుకున్నప్పుడు వెనుకా ముందు చూడకుండా వచ్చేసి.. తాము చెప్పాల్సింది చెప్పేసి.. తమ దారిన తాము వెళ్లిపోతుంటారు.

తాజాగా అలాంటి పనే చేశారు ఈ ఇద్దరు అధినేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాల్ని చవిచూసి.. విపక్ష నేతగా వ్యవహరిస్తున్నప్పటికి.. ప్రజల కంటే తనకు నచ్చిన వ్యవసాయం మీద ఫోకస్ చేసి.. తన దైన టైం కోసం ఫాంహౌస్ లో వెయిట్ చేయటం కేసీఆర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇక.. సోనియా గాంధీ విషయానికి వస్తే గడిచిన పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటూ.. మరెంత కాలం ఉండాలో అర్థంకాని అయోమయ స్థితిలో ఆమె ఉన్నారు. ప్రజల్లోకి చురుగ్గా దూసుకెళ్లే విషయంలో ఆమె ఎలా ఉంటారన్నది తెలిసిందే. రిమోట్ కంట్రోల్ ను కంట్రోల్ చేయటంలో ఉండే టాలెంట్.. ప్రజలకు మేలు చేసే అంశాల విషయంలో మాత్రం ఆమె తన సత్తా చాటలేదనే చెప్పాలి.

తాను కొడితే దెబ్బ బలంగా ఉంటుందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు కేసీఆర్. అదే సమయంలో.. రాష్ట్రపతి బాగా అలిసిపోయారంటూ సంచలన వ్యాఖ్యలతో అందరూ తనవైపు చూసేలా చేశారు సోనియాగాంధీ. ఈ ఇద్దరు అధినేతలు కొంతకాలంగా కామ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ పరంగా ఉప్పునిప్పుగా ఉండే ఈ ఇద్దరు అధినేతలు.. ఒకే రోజు ఒకే తరహాలో మాట్లాడి రాజకీయ సంచలనానికి తెర తీయటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News