ఎవరికి రానన్ని కష్టాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చాయి. అప్పుడెప్పుడో పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్ మహానగరానికి తాను చేసిన అభివృద్ధి గురించి తాను పడ్డ కష్టాన్ని పదే పదే చెప్పుకురావాల్సి వచ్చింది. పుష్కరం క్రితం జరిగిపోయిన అంశాల్ని ఇప్పుడే జరిగినట్లుగా చెప్పుకోవటం ఎంత కష్టం? అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న చంద్రబాబు అప్పుడెప్పుడో భాగ్యనగరికి తాను చేసిన పనుల గరించి గుర్తు తెచ్చుకొని మరీ చెబుతున్నారు. ఈ సందర్భంగా తాను పడిన కష్టాలు.. అవమానాలు చెప్పి గ్రేటర్ ప్రజల్ని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. ఇలాంటివన్నీ కూడా విభజన కాకున్నా.. లేదంటే.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చెప్పినా నడుస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత పక్కనున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన హైదరాబాద్ నగరానికి ఆయనేం చేయగలరంటూ తెలంగాణ అధికారపక్షం నేతలు అడుగుతున్న సూటి ప్రశ్నకు సమాధానం చెప్పని చంద్రబాబు.. తన ప్రతి ప్రసంగంలోనూ ఆవు కథను చెప్పుకొచ్చారు.
తన హయాంలో హైదరాబాద్ అభివృద్ధి అద్భుతంగా సాగిందని.. ఆ తర్వాత మహానగరాన్ని పట్టించుకున్న నాథుడే లేదని బాబు వాపోయారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ కు నిధులు తెచ్చేందుకు నాటి ప్రధాని వాజ్ పేయ్ చేత కూడా తిట్లు తిన్నానని.. దేశంలో హైదరాబాద్ తప్పించి మరో నగరం లేనట్లుగా వ్యవహరించటం ఏమిటంటూ వాజ్ పేయ్ విసుక్కునే వారని.. అయితే.. ఆయనకు నచ్చ చెప్పి నిధులు తెచ్చామన్న గతాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇక.. బిల్ గేట్స్ ఉదంతాన్ని ఎప్పటిలానే మనసును కదిలించేలా చెప్పే ప్రయత్నం చేశారు. తనకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి గేట్స్ ఒప్పుకోకున్నా.. పట్టుబట్టి ఐదు నిమిషాలు సమయాన్ని తీసుకుంటే.. తన ప్రణాళిక చూసి 45 నిమిషాలు సమావేశం సాగిందని గుర్తు చేసుకున్నారు. అలా మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు తెచ్చిన తర్వాత చాలా కంపెనీలు వచ్చాయన్నారు. గతంలో హైదరాబాద్ కు ఎవరైనా రావాలంటే ముంబయి దిగ రావాల్సి వచ్చేదని..అలా కాకుండా విదేశాల నుంచి నేరుగా హైదరాబాద్ కు విమానాలు వచ్చేలా చేశామన్నారు. అప్పట్లో హైదరాబాద్ పచ్చగా ఉంటే.. ఇప్పుడు దుమ్ము.. ధూళి.. పొగలతో నిండిపోయిందని చెప్పుకొచ్చారు.
తాను సాధించి ఘనతల్ని చెప్పుకున్న చంద్రబాబు మాటల్లో సూటిదనం.. కొత్తదనం లేకపోవటం.. గతంలో పలుమార్లు ప్రస్తావించిన అంశాల్ని పదే పదే వల్లె వేయటంతో విషయం సైడ్ ట్రాక్ పట్టి ఆసక్తి కంటే అనాసక్తిగా అనిపించక మానదు. చెప్పిన విషయాన్నే మళ్లీ చెబుతూ ఆవుకథ మాదిరి మారిన బాబు మాటలు గ్రేటర్ ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో చూడాలి.