చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపడితే.. ఓ మహిళా మంత్రి మాత్రం తన బెర్తు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. పనితీరులో లోపం - అవినీతి లాంటి కారణాల పునాదుల మీద కాదు.. ఆమెను తొలగిస్తుండడం! ఆమె సొంత బావ గారికి మంత్రిపదవి ఇవ్వడానికి చంద్రబాబు ఫిక్సయిపోయారు గనుక.. ఒకే ఫ్యామిలీలో రెండు పదవులు కరెక్టు కాదనే ఉద్దేశంతో ఆమెకు తూచ్ అననున్నారు. ఆమె మరెవరో కాదు.. కిమిడి మృణాళిని.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఖచ్చితంగా లక్ దక్కే వారిలో తెదేపా ఏపీ అద్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పేరు వినిపిస్తోంది. నిజానికి ఆయనకు పదవి ఇవ్వడం గురించి చాలాకాలంగా అనుకుంటున్నారు. కానీ జాప్యం జరుగుతోంది. విధేయతకు మారు పేరు అయిన కళా వెంకట్రావు కు ఈసారి బెర్తు గ్యారంటీ. మరి అదే సమయంలో ఆయనకు వరసకు మరదలు అయ్యే కిమిడి మృణాళిని ని ఇక తప్పిస్తారని సమాచారం.
ఒకే కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు లెక్క. అయితే ఈ సిద్ధాంతం తనకు వర్తించదని కూడా ఆయనకు తెలుసు. తన కుమారుడు లోకేష్ కు ఈసారి పదవి ఇవ్వడం ఖరారు చేసుకుంటున్న నేపథ్యంలో.. నారా కుటుంబం నుంచి ఇద్దరు కేబినెట్ లో ఉంటారన్నమాట.