పని చేసిన వాడికి చేతికి డబ్బులు వస్తే ఆనందం. ఏదైనా తిన్న వాడికి రుచి తెలిస్తే సంతోషం. పని చేసిన తర్వాత ఫలితం ఉంటే ఆనందం. ఇవేమీ లేకుండా చేసే పనులు పెద్దగా రాణించవు. సొంత మీడియాలతో సొంత మనుషులతో ఎంతగా భజన చేసుకున్నా పెద్దగా ఫలితం ఇవ్వవు. పండుగ చేసుకోండి.. వేడుకలు జరుపుకోండని ఎంతగా పిలుపులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ హడావుడి కూడా ఈ కోవలోకే వస్తుంది.
పట్టిసీమ ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీన ఆయన జాతికి అంకితం చేశారు. బుధవారం ఉదయాన్నే మోటారు స్విచ్ ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు. అయినా, కృష్ణా డెల్టాలో కానీ రాయలసీమలో కానీ ఏమాత్రం ఆనందం వ్యక్తం కాలేదు. ఇందుకు కారణం.. తెలుగు దేశం పార్టీ నాయకులు, ప్రభుత్వ నేతలంతా ఎంతగా జబ్బలు చరచుకున్నా.. పట్టిసీమ నుంచి నీళ్లు రాకపోవడమే.
నిజానికి పట్టిసీమ అద్భుతమైన ప్రాజెక్టు. అది పూర్తయిన తర్వాత దాని నుంచి రోజుకు 8000 క్యూసెక్కలు నీరు వస్తే.. అది కృష్ణా డెల్టాకు చేరితే.. ఆ నీటితో జూన్ లోనే డెల్టాలో నారుమళ్లు వేసుకుంటే రైతుల్లో అప్పుడు నిజమైన సంతోషం వ్యక్తమవుతుంది. అన్నదాతలు నిజంగానే పండగ చేసుకుంటారు. ఇది జరగాలంటే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి మొత్తం 24 పంపుల నుంచీ నీళ్లు వచ్చినప్పుడు మాత్రమే దానిని ప్రారంభించాల్సి ఉంది. కానీ, చంద్రబాబు సలహాదారులు తప్పుదోవ పట్టించారో లేక ఆయనే తప్పుడు అంచనాకు వచ్చారో కానీ.. పట్టిసీమ పూర్తి కాకుండానే తొందరపడ్డారు. దానిని జాతికి అంకితం పేరిట హడావుడి చేశారు. ఇప్పుడు ప్రారంభోత్సవం పేరిట మరో హడావుడి చేశారు. అయినా, అరకొరగానే నీళ్లు రావడం.. అది డెల్టాకు ఏమాత్రం ఉపయోగపడకపోవడం ఎవరిలోనూ సంతృప్తి మిగలలేదు. ఇకనుంచి అయినా చంద్రబాబు హడావుడి తగ్గించి పూర్తిస్థాయిలోనే పనులను పూర్తి చేయాలని తెలుగుదేశం అభిమానులు కూడా కోరుతున్నారు.
- గరుడ