అంత చేశాం.. ఇంత చేశాం అంటూ గొప్పలు చెప్పుకోవటం.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా రివ్యూ మీటింగ్ లు ఏర్పాటు చేసి.. తాను ఎంత కష్టపడుతున్న విషయాన్ని వెల్లడిస్తూ.. తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తాజాగా ఆయన వైఖరిని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది.
పై నుంచి ఆదేశాలు జారీ చేసి.. తాను చెబుతున్న పనులు జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాల్ని చూడాల్సిన ఏపీ ముఖ్యమంత్రి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు.గత రెండు రోజులుగా గోదావరి పుష్కరాల కోసం ఏపీలోని భక్తులు పెద్ద ఎత్తున కొవ్వూరు.. రాజమండ్రి.. నరసాపురం వెళ్తుతున్నారు. వాస్తవానికి తూర్పుగోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసినా.. ఏపీ సర్కారు ప్రచారం అంతా పుష్కరాలు కొవ్వూరు.. రాజమండ్రి.. నరసాపురం మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టటంతో.. అందరూ అక్కడిక వెళుతున్న పరిస్థితి.
ఈ మూడు ఘాట్లతో పోలిస్తే.. మిగిలిన ప్రాంతాల్లో కొంత రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ.. వాటికి ప్రచారం లభించేలా చేయటంలో ఏపీ సర్కారు పూర్తి స్థాయిలో విఫలం చెందిందని చెబుతున్నారు. పుష్కరాలంటే కేవలం మూడు ప్రాంతాలే అన్నట్లుగా.. గోదావరి పుష్కరాల కోసం ప్రచురించిన ప్రకటనలన్నింటిలోనూ ఈ మూడు ప్రాంతాలనే ప్రముఖంగా ప్రస్తావించటంతో గోదావరి జిల్లాల మీద అవగాహన లేని వారంతా.. ఈ మూడు చోట్లకే వెళుతున్నారు.
గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు మాత్రం.. మిగిలిన ఘాట్ల వైపు వెళుతున్నా.. బయట నుంచి వచ్చే సగటు భక్తులు ఈ మూడు ప్రాంతాల మీదనే దృష్టి సారించటం.. ఆయా ప్రాంతాల్లో పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. దీనికి తోడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతసేపటికి.. కొవ్వూరు.. రాజమండ్రి ఘాట్లు తప్పించి.. మిగిలిన వాటికి వెళ్లటం మీద పెద్దగా దృష్టి పెట్టకపోవటం కూడా.. పెద్ద లోపంగా చెబుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి.. మిగిలిన పుష్కర ప్రాంతాల మీద పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని కోరుతున్నారు.