కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ మొదలైన ఆందోళన ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆదివారం కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతోపాటు.. తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బాబు సర్కారు పట్టించుకోవటం లేదన్న భావన కాపుల్లో మరింత పెరిగింది. ఏపీని కుదిపేస్తున్న కాపుల అంశంపై చంద్రబాబు దృష్టి సారించారు. బుధవారం జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో కాపుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కాపు ఉద్యమం కారణంగా ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు చర్చకు వచ్చాయి.
ఏ అంశాన్ని ఎలా డీల్ చేయాలి? ఏం చేయాలి? లాంటి అంశాలపై మంత్రివర్గం లోతుగా దృష్టి సారించింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై బాబు ఏమేం చేయాలనుకుంటున్నారన్న విషయంలోకి వెళితే..
బీసీలపై గళం విప్పుదామన్న కృష్ణయ్య సంగతేంది?
కాపుల్ని బీసీల్లో చేరిస్తే.. ఇప్పటికే బీసీల్లో ఉన్న వారి ప్రయోజనాలు దెబ్బ తింటాయంటూ టీటీడీపీ నేత.. బీసీ వర్గాల ఉద్యమ నేత అయిన కృష్ణయ్య ఆందోళనపై మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. ఈసందర్భంగా స్పందించిన చంద్రబాబు.. కృష్ణయ్యతో తాను స్వయంగా మాట్లాడతానని.. అవసరమైతే పిలిపించుకొని ఆయనతో చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. వారికి సంబంధించిన ఒక్క ప్రయోజనం దెబ్బ తినకుండా చూస్తామన్న భరోసా ఇద్దామని.. ఇదే విషయాన్ని కృష్ణయ్యకు వివరిద్దామన్నారు.
‘కాపు’ ఇష్యూకు సొల్యూషన్ ఇదే
కాపుల్ని బీసీల్లో చేర్చే అంశానికి సంబంధించి బాబు సర్కారు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కాపుల రిజర్వేషన్ల సాకారం కోసం జస్టిస్ మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేసిన సర్కారు.. దానికి సహాయం చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సంఘంలో ముగ్గురు కాపు నేతలు.. ముగ్గురు బీసీ నేతలు ఉండటం గమనార్హం. కాపు నేతలైన మంత్రులు నిమ్మకాయ చినరాజప్ప.. గంటా శ్రీనివాసరావు.. పి. నారాయణ ఉంటారు. ఇక బీసీ నేతల్లో మంత్రులు యనమల రామకృష్ణుడు.. కేఈ కృష్ణమూర్తి.. కొల్లు రవీంద్రలు ఉంటారు.
క్రెడిట్ పోకుండా రిజర్వేషన్లు
ఈ మొత్తం ఎపిసోడ్ లో కాపులను బీసీల్లోకి చేర్చే విషయం మీద పాజిటివ్ గా ఉన్న చంద్రబాబు సర్కారు.. అదే సమయంలో దాని వల్ల వచ్చే క్రెడిట్ ను ఒక్కశాతం మిస్ కాకూడదని భావిస్తోంది. కాపుల్ని బీసీల్లో చేర్చింది.. తమ ఒత్తిడి వల్లనేనన్నబావన ప్రజల్లో చోటు చేసుకోకుండా దృష్టి సారించాల్సిన బాధ్యతను కాపు మంత్రులపై బాబు పెట్టారు. కాపుల్ని బీసీల్లో చేర్చే విషయంపై తాము ఎంతగా కష్టపడుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయటంతో పాటు.. ఎవరి ఒత్తిడితోనే ఇదంతా జరుగుతుందన్న భావన కంటేకూడా.. తమకు తామే ఈ అంశంపై దృష్టి పెట్టామన్న భావన కలిగేలా చూడాలని బాబు సర్కారు భావిస్తోంది. ఒకవేళ.. క్రెడిట్ ఇష్యూ మీద మాట్లాడాల్సి వస్తే.. కాపు నేతలే మాట్లాడాలని డిసైడ్ చేశారు.
‘పల్లె’ చేసిన పనులు చేయొద్దు
మంత్రి పల్లె రఘనాధరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కొందరు నొచ్చుకుంటున్నట్లుగా బాబు ప్రస్తావించటమేకాదు.. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ బాబు సూచించారు.
ముద్రగడ ఇష్యూను ఏం చేస్తారు?
కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు వీలుగా బాబు సర్కారు యుద్ధ ప్రాతిపదికన రియాక్ట్ అవుతుంటే.. మరోవైపు.. ఈ అంశాన్ని పూర్తిగా తేల్చేయాలని లేని పక్షంలో ఈ 5 (శుక్రవారం) నుంచి తన కుటుంబంతో సహా ఆమరణ నిరాహారా దీక్ష చేస్తానంటూ ముద్రగడ పద్మనాభం ప్రకటించటం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో ముద్రగడ తీరు కంటే ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరికే కాపు సంఘాల నేతలు మద్దుతు ఇస్తున్నందున.. ముద్రగడతో చర్చలు కాపు సంఘాల నేతలతోనే మాట్లాడించాలన్న భావనలో చంద్రబాబు ఉన్నారు.