కాంగ్రెస్.... వంద సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న పార్టీ.
కాంగ్రెస్..... దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ట్రాలను పాలించిన పార్టీ
కాంగ్రెస్... సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి అప్రతిష్టను మూటకట్టుకున్న పార్టీ
తెలుగుదేశం... తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పుట్టిన పార్టీ.
తెలుగుదేశం... కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహానటుడు ఎన్.టి.రామారావు ప్రారంభించిన రాజకీయ పార్టీ.
తెలుగుదేశం.... కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఎవ్వరితోనైనా కలిసేందుకు ముందుకు వచ్చే పార్టీ.
ఇదీ ఈ రెండు పార్టీలకు సంబంధించి చరిత్ర.... రాజకీయ అనుభవం. ప్రజలతో ఉన్న సంబంధం.ఈ రెండు పార్టీలు కలలో కూడా కలవవని... ఇవి రెండు భిన్న ద్రవాలని తెలుగు ప్రజలు నిర్దారణకు వచ్చిన పార్టీలు. అయితే ఇప్పుడు వ్యక్తిగత అవసరాలతో ఈ రెండు పార్టీలు జత కలిసాయి. భారతీయ జనతా పార్టీని ప్రాంతీయ పార్టీగా ఎదుర్కొనే సత్తా లేకపోవడం వల్లే ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో కలిసారనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణలో పార్టీ ఎదుగుదలతో పాటు వ్యక్తిగత వ్యవహారాల కారణంగా కాంగ్రెస్ పార్టీతో కలవడం చారిత్రక తప్పిదమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమైక్య రాష్ట్రాన్ని విడదీసిన పాపం కాంగ్రెప్ పార్టీదే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని, మరో 30 - 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో నూకలు చెల్లినట్లుగానే ఏసీ ప్రజలు భావించారు. అయితే హఠాత్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ప్రయోజనాలు ఆశించారో తెలియదు కాని కాంగ్రెస్ తో కలవడం మాత్రం ఏపీ ప్రజలకు మింగుడు పడడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీల కలయిక కారణంగా తెలంగాణలో తాత్కాలికంగా తెలుగుదేశం పార్టీ ఒకటి రెండు చోట్ల విజయం సాధించినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రబాబు నాయుడికి - తెలుగుదేశం పార్టీకి కాలం చెల్లినట్లేనని అంటున్నారు. ఇది గ్రహించని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలు - అనంతరం వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దారుణాతి దారుణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో మైత్రి కారణంగా బలపడే అవకాశాలుంటే ఇదే మైత్రి కారణంగా చంద్రబాబు నాయుడు పూర్తిగా బలహీన పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోందంటున్నారు.