ఏపీ మంత్రులను బెదిరించడానికి చంద్రబాబు మరోసారి తన పాత అస్త్రాన్ని బయటకు తీశారు. ఇటీవల కొందరు మంత్రులు చంద్రబాబును పెద్దగా కేర్ చేయడం లేదట. దీంతో ఆయన తన అమ్ముల పొదిలోని పాత బాణాన్ని మరోసారి బయటకు తీస్తున్నట్లు తెలుస్తోంది. లెక్కచేయని వారిని సడెన్ గా తప్పిస్తే … తిరుగుబాటు చేసే అవకాశం వుందని, ఆలోచిస్తున్న చంద్రబాబు మరోసారి ర్యాంకులతో వారిని దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
గతంలో మంత్రుల పనితీరుపై బాబు ర్యాంకులు ఇవ్వడం..చాలా మంది చంద్రబాబు ఆంతరంగిక - వ్యాపార - ఆర్థిక మిత్రులైన మంత్రులకు చిట్టచివరి ర్యాంకులు రావడంతో వారు అలిగారు. దీంతో లైట్ తీసుకోండంటూ..వారిని దువ్వి..తాత్కాలికంగా ర్యాంకుల మెయిలింగ్ కు బ్రేక్ వేశారు. అయితే.. మళ్లీ అంతా దారి తప్పుతుండడంతో మళ్లీ ర్యాంకులను ముందుకు తెస్తున్నట్లు టాక్.
తాజాగా పోలవరం స్పిల్ వే శంకుస్థాపన సభకు మంత్రులు డుమ్మా కొట్టడంతో ..కొమ్ములు తిరిగిన మంత్రులకు ముకుతాడు వేసేందుకు మళ్లీ బాబు గ్రేడింగ్, రేటింగ్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని జోరుగా వినిపిస్తోంది. అప్పట్లో షాడో సీఎంలాంటి పొంగూరి నారాయణ ర్యాంకు వీక్ కావడంతో … ఒక రేంజ్‌లో రగడ రాజుకుంది. నారాయణ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులు 1 నుంచి 100 ర్యాంకులు కొట్టేస్తే..అదే సంస్థ వ్యవస్థాపకుడు అయిన నారాయణకు పూర్ ర్యాంకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీక్ ర్యాంక్ కారణంగా అలిగిన తన ఆంతరంగిక మంత్రి సంగతి తెలిసి చంద్రబాబు సముదాయించాడని అప్పట్లో మీడియాలో కథనాలొచ్చాయి. కొద్దికాలం బ్రేకిచ్చిన ర్యాంకుల వ్యవస్థకు మళ్లీ చంద్రబాబు రూపమిస్తున్నారని... ఈసారి ఆ ర్యాంకుల ఆధారంగానే వేటు వేస్తారని వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/