వైఎస్సార్ రోశయ్య జోడీలా రేవంత్ భట్టి సూపర్ !

తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో హాయిగా ఉన్నారు అంటే దానికి కారణం ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అని అంతా అంటున్నారు.;

Update: 2025-03-18 03:00 GMT

తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో హాయిగా ఉన్నారు అంటే దానికి కారణం ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అని అంతా అంటున్నారు. నిజానికి సీఎం క్యాండిడేట్ ఫిగర్ గా ఉన్న భట్టి విక్రమార్క హైకమాండ్ మాట మేరకు ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారు.

ఆయనది ఎంతో సుదీర్ఘమైన అనుభవం కలిగిన రాజకీయం పైగా కీలకమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయన ఎంతో సహనంతో ఉంటారు. బాధ్యతల పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. కాంగ్రెస్ కి విధేయత ఆయనకు ఒక వరంగా ఉంది. అలాగే ఆయన రేవంత్ రెడ్డికి ఏకంగా కుడి భుజంగా మారిపోయారు. రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ముఖ్యమంత్రి భారాన్ని తాను భరిస్తూ ఒక విధంగా బెస్ట్ జోడీ అయ్యారు. రేవంత్ రెడ్డి అందుకే భట్టిని విపరీతంగా నమ్ముతూ ఆయనకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు

ఆయన ఎపుడు ఢిల్లీ వెళ్ళినా వెంట భట్టి విక్రమార్క ఉండాల్సిందే. ఇద్దరూ హైకమాండ్ వద్ద ఒకే బాటగా ఒకే మాటగా ఉండడం చూసిన ఢిల్లీ పెద్దలు కూడా తెలంగాణాలో సూపర్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రి ఉంది. ఆ పదవిలోకి వచ్చిన వారు తరువాత టార్గెట్ సీఎం కే అంటారు.

దాని కోసం కుర్చీ ఎక్కిన మొదటి రోజు నుంచి చేయాల్సిన రాజకీయం చేస్తారు. దాంతో సీఎం ది ఒక వర్గం డిప్యూటీ సీఎం ది మరో వర్గం అన్నట్లుగా ఉంటుంది. పార్టె లో ప్రభుత్వంలో ఇదే తీరు కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇది సహజంగా ఉంటోంది.

పక్కనే ఉన్న కర్ణాటకలో చూస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల మధ్య గ్యాప్ చాలానే ఉంది. రెండు శిబిరాలు అయ్యాయన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ తెలంగాణాలో అలా కాదు ఒక ఆత్మలా రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉంటున్నారు.

తనకు పదవులు కంటే పార్టీ అప్పగించిన బాధ్యతలు ముఖ్యమనుకునే భట్టి ఉండడం రేవంత్ రెడ్డి అదృష్టం అని అంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా సీనియర్ నేతగా భట్టికి ఎనలేని విలువ ఇస్తున్నరు. ఆయన మాటనే చెల్లుబాటు అయ్యేలా చూస్తున్నారు. కీలకమైన మీటింగులు ఏమైనా ఆయననే అధ్యక్షత వహించమంటున్నారు.. అదే విధంగా పార్టీ ప్రభుత్వంతో కో ఆర్డినేషన్ కూడా భట్టి చూసుకుంటున్నారు. ప్రతిపక్షాలను పిలిచి అఖిల పక్షం మీటింగ్ ని కూడా భట్టి కండక్ట్ చేస్తున్నారు.

మరో వైపు చూస్తే తెలంగాణా ఖజానాను బీఆర్ఎస్ పదేళ్ళ కాలంలో దివాళా తీయించింది అని రేవంత్ రెడ్డి తరచూ ఆరోపిస్తున్నారు. నిధులు లేవని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి ఇచ్చే హామీలకు కానీ పధకాలకు కానీ ఏదో విధంగా నిధులను సమకూరుస్తూ భట్టి విక్రమార్క ఎంతో కృషి చేస్తున్నారు.

దాంతో రేవంత్ కి చాలా ఈజీ అవుతోంది అని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబోని చూసిన వారు నాటి వైఎస్సార్ రోశయ్యల జోడీని గుర్తు చేసుకుంటున్నారు. రోశయ్య వైఎస్సార్ కి పెద్దన్నగా ఉండేవారు. అలాగే రేవంత్ కి భట్టి అన్నగా ఉంటూ అండగా నిలుస్తున్నారు అని కాంగ్రెస్ లోనే అంతా అంటున్న మాటగా ఉంది.

Tags:    

Similar News