ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోగానే.. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోయింది. వెంటనే ఏపీ క్యాపిటల్ ఏదంటూ చర్చ మొదలైంది. నిపుణుల అభిప్రాయలు ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విజయవాడ.. గుంటూరు మధ్య రాజధాని ఉండాలని నిర్ణయించింది. ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరును కూడా నిర్ణయించింది. ఐతే ఈ పేరు పెట్టడంలో ప్రధాన పాత్ర ఎవరిది అన్నది వెల్లడి కాలేదు. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో ఈ పేరు వెనుక రహస్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఆంధ్రుల కొత్త రాజధానికి పేరు నిర్ణయించింది రామోజీ రావు అని చంద్రబాబు చెప్పడం విశేషం.
కొత్త రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని తామంతా చాలా ఆలోచించామని.. ఐతే ఆ సమయంలో రామోజీరావు రీసెర్చ్ చేసి.. అమరావతి అని పెడితే బాగుంటుందని ప్రతిపాదించారని.. అందరికీ ఆ పేరు నచ్చి దాన్నే ఏకగ్రీవంగా ఆమోగించామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి అనే పేరు విషయంలో అభ్యంతరాలేమీ లేవు కానీ.. రామోజీ చెబితే తప్ప చంద్రబాబు సొంతగా ఇదో లేదా ఇంకో పేరు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారా అన్నది సందేహం. రామోజీ మీద చంద్రబాబుకున్న గౌరవం.. భక్తి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన రాజకీయంగా ఆయన సలహాల మేరకే నడుచుకుంటారన్న అభిప్రాయాలున్నాయి. ఆ సంగతెలా ఉన్నా.. రాజధాని పేరును కూడా రామోజీ చేతే నిర్ణయించడం అన్నదే విడ్డూరంగా ఉంది. మామూలుగా చంద్రబాబు ఇలాంటి విషయాలు బయట చెప్పరు. కానీ బహిరంగ వేదికలో ఈ మాట చెప్పడం ద్వారా చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారన్నది వాస్తవం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/