ట‌ర్కీలో ఉన్నా అవే ప‌నులా బాబు?

Update: 2015-08-08 16:35 GMT
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కాస్తంత‌ రిలాక్సేషన్ కోరుకుంటూ ట‌ర్కీలోని ఇస్తాంబుల్ టూర్ కు వెళ్లాలురు విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ ఉంటూ కూడా...త‌న వ్య‌వ‌హార‌శైలిని మార్చుకోలేద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఉన్న‌ప్ప‌టికీ...రాష్ట్ర స్థితిగతులపై ఆరా తీశారని స‌మాచారం.

ఎప్పుడూ లేనంతగా...దక్షిణ భారతాన్ని వర్షాభావం పీడిస్తోంది. ఏపీ, తెలంగాణల్లో అయితే ఏకంగా కరవు తాండవిస్తోంది. దీంతో...ఆంధ్రాలో పరిస్థితిని ముందుగానే సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే వర్షాభావం ఎదుర్కొంటున్న జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహించగా.. ఆ అప్ డేట్స్ ను చంద్రబాబుకు అడిగి తెలుసుకున్నారు. ఇటు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సంబంధిత శాఖల ఇతర అధికారులను టెలీ కాన్ఫరెన్స్ లోకి తీసుకున్న సీఎం.. తీసుకోవాల్సిన చర్యలపై పక్కా సూచనలు జారీ చేశారు. అందుకు తగ్గట్లుగానే.. అధికారులు కూడా సమస్యను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామంటూ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్రత్యేకించి వర్షాభావంతో అల్లాడుతున్న ఏపీలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు చంద్రబాబు.

రాష్ట్రంలో 345 మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని, 325 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యిందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 24.14 లక్షల హెక్టార్లలో పంటలను సాగు చేశారని, గత ఏడాదితో పోలిస్తే 3.81 లక్షల హెక్టార్లలో తక్కువ సాగునమోదైందని లెక్కలు చెప్పారు. వర్షాలు లేని పరిస్థితి నెలకొన్న క్రమంలో 14 రకాల ప్రత్యామ్నాయ పంట విత్తనాలు సిద్ధంగా ఉంచామని, వాటిని 50 శాతం సబ్సిడీపై రైతులకు అందించే ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి. ఇటు అనంతపురం, కర్నూలు, చిత్తూరుల్లో వేరుశనగ సాగు 5లక్షల హెక్టార్ల మేర తగ్గిందని, అయినా సరే రైతులకు భరోసా ఇవ్వాలని చంద్ర‌బాబు వారికి సూచించారు.

సాగునీరు, తాగునీరే కాదు.. కరవుతో పశువులకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని బాబు ఆదేశించారు. ఉపాధిహామీ పథకాన్ని పక్కాగా అమలు చేసి.. పేదవారికి పని కల్పించాలన్నారు. జలాశయాల్లో నీటిమట్టాలను విశ్లేషించిన బాబు.. వర్షాల కోసం ఈ నెల 15 వరకూ వేచిచూస్తూనే ప్రత్యామ్నాయ ప్ర ణాళికలు రూపొందించాలన్నారు.

 పుష్కరాల అనంతరం విరామం కోసం కుటుంబంతో కలిసి ఇస్తాంబుల్ వెళ్లిన బాబు రాష్ర్టంలోని స‌మ‌స్య‌ల‌పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మ‌రీ ఫాలో అప్ చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అధికారులు స‌మా తెలుగుదేశం శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తంచేస్తున్నాయి.
Tags:    

Similar News