తాజా ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలి దూకుడు ప్రదర్శిస్తున్నారు. టీడీపీ హయాంలో నిర్మితమై టీడీపీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉన్న ప్రజా వేదికలో కూర్చున్న జగన్... దానిని కూల్చివేయించారు. ప్రజా వేదికలో కూర్చుని ఆ నిర్మాణం అక్రమమైనదేనని తేల్చేసి జగన్ కొట్టిన దెబ్బ చంద్రబాబుకు గట్టిగానే తగిలినట్టుంది. ప్రజా వేదిక కూల్చివేత ఇంకా పూర్తి కాకుండానే... తాను ఉంటున్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణమేనన్న విషయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... ఆ ఇంటిని ఖాళీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నారట.
ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం తన ఇంటిలో నిర్వహించిన బేటీకి హాజరైన నేతల్లో మెజారిటీ మంది ఆ ఇంటిని ఖాళీ చేయడమే ఉత్తమమని చెప్పారట. దీంతో అక్కడికక్కడే ఇంటిని ఖాళీ చేయాలని తీర్మానించుకున్న చంద్రబాబు... విజయవాడలో తన నివాసానికి అనువుగా ఉన్న ఇంటిని వెతికిపెట్టాలని తన పార్టీ నేతలకు చెప్పారట. బాబు ఈ స్టెప్ తీసుకున్నారంటేనే... ప్రజా వేదికను కూల్చివేయాలంటూ జగన్ తీసుకున్న నిర్ణయం బాబుకు గట్టిగానే తగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బాబు మాట విన్నంతనే బెజవాడలో ఆయన నివాసం ఉండేందుకు అనువుగా ఉన్న భవనాలేంటన్న విషయాన్ని ఆరా తీసిన టీడీపీ నేతలు... క్వాలిటీ ఐస్ క్రీమ్స్ గెస్ట్ హౌస్ - గ్రావెల్ ఇండియా గెస్ట్ హౌస్ తో పాటు నగరంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన నోవాటెల్ స్టార్ హోటల్ సమీపంలోని మరో గెస్ట్ హౌస్ ను కూడా షార్ట్ లిస్ట్ చేశారట. సో... అక్రమ నిర్మాణమని ప్రజావేదికను తేల్చేసి దానిని కూలగొట్టేయించే దిశగా జగన్ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు కాస్తంత గట్టిగానే తగిలిందన్న మాట.