కేసీఆర్‌కు చంద్రబాబు ఓపెన్‌ వార్నింగ్‌.. 1

Update: 2015-06-08 16:23 GMT
గత ఎనిమిది రోజులుగా వీడియో.. ఆడియో టేపులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు అధినేత కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓపెన్‌ వార్నింగ్‌ ఇచ్చేశారు. పోలీసులు.. ఏసీబీ.. నోటీసులు.. కేసులు అంటూ దాడి చేస్తున్న తెలంగాణ అధికారపక్షం నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు.. ఎప్పుడూ లేని విధంగా తన అడ్డా నుంచి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేయటమే కాదు.. హైదరాబాద్‌ మీద తనకున్న హక్కును తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడినట్లుగా ఆడియో టేపులు వెలువడిన ఒక రోజు తర్వాత బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబును టార్గెట్‌ చేసిన క్రమంలో.. తాము చేసింది అవినీతి బాబునే తప్పించి.. ఏపీ ప్రజల్ని కాదంటూ కాస్త జాగ్రత్త పడినప్పటికీ.. తన మీద చేస్తున్న దాడి మొత్తం ఏపీ ప్రజల మీదనే అన్న సందేశాన్ని ఇచ్చేలా మాట్లాడటంలో చంద్రబాబు సక్సెస్‌ అయ్యారు.

విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్‌ పేరు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

I నేను కేసీఆర్‌ సర్వంట్‌ను కాను. నా ఫోన్‌లను ట్యాప్‌ చేయటం నేరం.. ద్రోహం.

I ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా ఇస్తా. నన్ను ఏమీ చేయలేరు.

I అధికారంలో ఉన్నామని ఫోన్‌ ట్యాపింగ్‌లు చేస్తూ.. స్టింగ్‌ ఆపరేషన్‌లు చేస్తూ నీచాతినీచానికి పాల్పడుతున్నారు.

I హైదరాబాద్‌పై తెలంగాణ ముఖ్యమంత్రికి ఎంత హక్కు ఉందో.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి కూడా అంతే హక్కు ఉంది.

I మీ ఏసీబీ మీకు ఉంటే.. మా ఏసీబీ మాకు ఉంది. మీ పోలీసులు మీకు ఉంటే మా పోలీసులు మాకూ ఉన్నారు.

I నన్ను ఏమీ చేయలేని తెలంగాణ ముఖ్యమంత్రి కుట్రలు పన్నుతున్నారు.

I ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అధికారాలు గవర్నర్‌కే ఉండాలి.

I తెలుగుదేశం పార్టీని ఏమైనా చేయాలనుకుంటే అది సాధ్యం కాదు.

I టీఆర్‌ఎస్‌ సర్కారును ప్రశ్నించిన మీడియా వారి కేబుల్స్‌ కత్తిరిస్తున్నారు. ఇది ఆక్షేపణీయం.

I జైలుకు వెళ్లి వచ్చిన నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు. నీతిగా బతికా. నేను ఎవరికీ భయపడను.

I రాష్ట్రాల మధ్య తగాదా వద్దు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆలోచించాలి.

I రేవంత్‌రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు.

I నేను ఫోన్‌ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు.

Iఇది నీ జాగీరా.. కాదు. నా మీద కుట్ర చేస్తున్నారు.

Tags:    

Similar News