దక్షిణాదీయులపై ఉత్తరాది వివక్ష సరికాదు. ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు మమ్మల్ని అణిచివేయవద్దు. గతంలో నిరాదరణకు గురైన దక్షిణాది వారికి ఇకనైనా ప్రాముఖ్యత దక్కాలి.--ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలి ఆగ్రహ జ్వాలలు. ఇందులో మెజార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకనాటి మిత్రపక్షం అయినప్పటికీ బీజేపీపై ఇటీవల పవన్ తన స్టాండ్ మార్చుకున్నారు. తప్పులను ఎండగడుతున్నారు. అయితే ఇపుడు అదే రీతిలో మరో మిత్రపక్షమైన టీడీపీని ఇదే జాతి వివక్షపై ప్రశ్నిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ అది ఏ విషయంలో అంటే ఇప్పటివరకూ తెలుగువారికే పరిమితమైన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పదవి ఇకపై ఉత్తరాది అధికారుల సొంతం కాబోతోంది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం టీటీడీ ఇఓగా ఉత్తరాదికి చెందిన ఏపీ క్యాడర్ అధికారి ఏకే సింఘాల్ నియామకం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్ లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సింఘాల్ కు టీడీపీ ఈఓ పదవి ఇప్పించే బాధ్యతను టీడీపీకి చెందిన ఓ కేంద్రమంత్రి భుజానికెత్తుకున్నారన్న వ్యాఖ్యలు సొంత పార్టీవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సదరు కేంద్రమంత్రి ఢిల్లీలో ప్రముఖ స్థానాల్లో ఉన్న, సొంత సామాజికవర్గ ప్రముఖుల దన్నుతో సింఘాల్ కు ఆ పదవి ఇప్పించేందుకు చేస్తున్న కృషి దాదాపు ఫలించిందని, త్వరలో సింఘాల్ పేరు ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా సదరు కేంద్రమంత్రికి ఆయన పేరును సీబీఐకి చెందిన ఒక ఉన్నతాధికారి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఆ కేంద్రమంత్రికి సాయం చేసినందుకు కృతజ్ఞతగానే, ఇప్పుడు ఆ సీబీఐ అధికారి సిఫార్సు చేసిన అధికారికి టీటీడీ ఈఓ పదవి ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.
మరోవైపు దీనిపై తెలుగువారైన ఐఏఎస్ లతోపాటు - కర్నాటక - తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారుల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఏనాడూ ఉత్తరాది అధికారికి టీటీడీ పగ్గాలు ఇచ్చిన దాఖలాలు లేవనీ, ఒకసారి ఉత్తరాదికి చెందిన అధికారికి టీటీడీ ఈఓ పదవి అప్పగిస్తే, ఇకపై అదే సంప్రదాయం కొనసాగుతుందని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ లకు అవకాశాలు ఏమాత్రం ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే పలు కారణాల రిత్యా ఉత్తరాది హవా పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిష్ఠాత్మక టీటీడీ ఈఓ పదవి కూడా వారి ఖాతాలోకి వెళితే, ఇక దక్షిణాది ఉనికి పూర్తిగా కనుమరుగయిపోతుందన్న ఆవేదన తెలుగు అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు స్పందించపోతే, ప్రతిష్ఠాత్మకమైన టిటిడిపై రాష్ట్రం పట్టు కూడా పోతుందని స్పష్టం చేస్తున్నారు.
ఉత్తరాది వారికి వ్యతిరేకంగా దక్షిణాదివాసులకు మద్దతుగా ఇటీవల గళం విప్పుతున్న పవన్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తన మిత్రపక్షమైన టీడీపీ చేస్తే ఉత్తరాది-దక్షిణాది అనేది పట్టించుకోనట్లుగా పవన్ లైట్ తీసుకుంటారా అనే చర్చ మొదలైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/