పాలనా పరంగా తప్పుల మీద తప్పులు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో తప్పటడుగు వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విమర్ళలకు అవకాశం ఇచ్చే ఏ చిన్న నిర్ణయాన్ని తీసుకోవటం సరికాదు. ఎందుకంటే.. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినోళ్లకు.. అడగనోళ్లకు వరాలు ప్రకటిస్తూ.. ప్రజల మనసుల్ని దోచుకుంటుంటే.. మరోవైపు బాబు సర్కారు మాత్రం అందుకు భిన్నంగా బాదుడు మీద ఫోకస్ చేయటం గమనార్హం.
ఏపీ పరిధిలోని ప్రభుత్వ.. ప్రవేటు.. రెసిడెన్షియల్.. మున్సిపల్ కు సంబంధించి వివిధ విభాగాలకు చెందిన పాఠశాలలు ఉన్నాయి. ఇవి మొత్తం 61,918 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య కాస్త అటూఇటూగా 72 లక్షలు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య దాదాపు 45 లక్షల వరకూ ఉంటుంది,
ఏపీ పరిదిలోని 72 లక్షల విద్యార్థులంతా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థి రూ.10 చొప్పున విరాళం ఇవ్వాలంటూ ఏపీ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్ని చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఎందుకంటే.. ప్రజలకు నచ్చి.. తమకు తాముగా స్వచ్ఛందంగా ఏదైనా ఇవ్వటం ఒక పద్ధతి.
అంతేకానీ.. నిబంధనగా పెట్టి పది పైసలు వసూలు చేసినా అది అంతగా ఆకట్టుకోదు. భావోద్వేగ అంశాల్ని రగల్చటం బానే ఉంటుంది. అలాంటివి మరింత స్ఫూర్తిని రగిలించేలా ఉండాలే తప్పించి.. విమర్ళలకు అవకాశం ఇచ్చేలా ఉండకూడదు. చదువుకునే చిట్టిచిట్టి చిన్నారులంతా రూ.10 చొప్పున విరాళం ఇవ్వాలని చెబుతున్న ఏపీ సర్కారు.. మొదట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు.. ఆయన సర్కారులోని ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. ఇలా ఒక్కరు కూడా తమ జేబుల్లో నుంచి పైసా తీసింది లేదు. కానీ.. స్కూల్ పిల్లలు రూ.10 చొప్పున వసూలు చేయాలన్న నిర్ణయం తీసుకోవటం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవాల్టి రోజున రూ.10 పెద్ద మొత్తం కానప్పటికి.. ఏపీ రాజధాని అమరావతిలో అందరూ భాగస్వామ్యం కావాలన్న ఆలోచన మంచిదే. మరి.. ఆ భాగస్వామ్యం విషయంలోఅధికార పార్టీ మాటేమిటి? రాష్ట్ర ముఖ్యమంత్రి వాటా ఎంత? లాంటి ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పలేరు. తాము తప్ప మిగిలిన అన్ని వర్గాలు అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నట్లుగా చంద్రబాబు సర్కారు ఆలోచించటమేంటి? నిజానికి ఈ రూ.10 కార్యక్రమంతో ప్రభుత్వానికి సమకూరే మొత్తం రూ.8కోట్లు కూడా ఉండదు. ఈ మాత్రం దానికి విమర్శలు చెలరేగేలా చూసేకోవటం.. వేలెత్తి చూపించుకునేలా చేసుకోవటం అవసరమా? పిల్లల దగ్గర రూ.10 వసూలు చేయాలన్నది అమరావతిలో భాగస్వామ్యమని బాబు సర్కారు భావిస్తుందేమో కానీ.. జనాలకు మాత్రం ఇది కచ్చితంగా కక్కుర్తి అనిపించక మానదు.