ఇప్పుడు ప్రతి ఒక్కరికి తేరగా దొరికాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి స్థాయిని జోకర్ స్థాయికి మార్చేసిన క్రెడిట్ ట్రంప్ కే దక్కుతుంది. అయ్యగారి పుణ్యమా అని.. డ్రగ్స్ దగ్గర నుంచి.. క్యాన్సర్ కణితి వరకూ.. సర్వ దరిద్రాలకు ట్రంప్ పేరు పెట్టేసుకోవటం ఒక అలవాటుగా మారింది. ఇదే ఊపులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటోళ్లకు ట్రంప్ మంచి ముడిసరుకుగా మారారు.
ఆయన పేరుతో నీతులు చెప్పేస్తున్నారు చంద్రబాబు. కీలక స్థానాలకు ఎన్నుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని లేదంటే ట్రంప్ లాంటి డేంజర్ గాళ్లు కీలకస్థానాల్లోకి వస్తారంటూ చెప్పుకున్నారు. తాను తప్పించి.. లోకమంతా దుర్మార్గమనే మాట బాబు నోటి నుంచి పదే పదే రావటం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో తాను తప్పించి.. మిగిలిన వారంతా ట్రంప్ లాంటోళ్లేనన్నది బాబుగారి ఉవాచ. నిత్యం తన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. నోట మాట రాకుండా రానివ్వకుండా ఏసుకునే ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ట్రంప్ తో పోలుస్తూ చంద్రబాబు మాట్లాడినట్లుగా చెప్పొచ్చు.
ట్రంప్ పేరుతో జగన్ ను ముడిపెట్టనప్పటికీ.. ట్రంప్ కు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే.. దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు చేయటం ద్వారా.. తన మాటల్ని జగన్ మీద పరోక్షంగా గురి పెట్టటం కనిపిస్తుంది. ఒకవేళ ఏపీ ప్రజలు కానీ ట్రంప్ లాంటి జోకర్ ను ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలోకి పడుతుందని వ్యాఖ్యానించటం గమనార్హం. పిచ్చోడి చేతిలోరాయి మాదిరి ట్రంప్ చేతిలో అధికారం మారిందన్న వ్యాఖ్యల్ని చేసిన బాబు మాటల్ని చూస్తే.. తన ప్రత్యర్థి జగన్ పై ఏదో రకంగా తిట్టిపోయాలన్న ధ్యాస తప్పించి మరింకేమీ కనిపించదన్న భావన కలగటం ఖాయం.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి దేశం పేరు ప్రఖ్యాతుల్ని ఎంతగా నాశనం చేస్తాడన్నది ట్రంప్ ను చూస్తే అర్థమవుతుందని.. ఇప్పుడు అమెరికాలో చోటు చేసుకున్న నిరసనలు.. ఆందోళనలే నిదర్శనంగా బాబు పేర్కొనటం గమనార్హం. ఎక్కడో అమెరికాలోనిట్రంప్ గురించి ప్రస్తావించి.. ఇన్ని మాటలు చెబుతున్న బాబు.. అనంతపురంలోని తన వియ్యంకుడి అడ్డాలో చోటు చేసుకుంటున్న ఆరాచకాలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నా.. ఎందుకు పెదవి విప్పరు? ఎందుకు వేటు వేయరంటారు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/