రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు, త్రీ టైమ్స్ సీఎం, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఇదీ.. మాజీ ముఖ్య మంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి.. టీడీపీ అభిమానులు చెప్పుకొనే చరిత్ర! ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. మరి ఇంత సీనియార్టీ ఉన్న నాయకుడుగా చంద్రబాబు ఎలా ఆలోచించాలి? ఏ చిన్నపాటి గ్యాసిప్ వచ్చినా.. హడలి పోవాలా? వెంటనే రంగంలోకి దూకేయాలా? పని ప్రారంభించేయా లా? ఇదీ.. ఇప్పుడు టీడీపీ సీనియర్లను వేధిస్తున్న మాట. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో.. సోషల్ మీడియా వ్యూహాలు మారిపోతున్నాయి. ఎవరిని బుట్టలో వేద్దామా? ఎవరిని తప్పుదారి పట్టిద్దామా? అనే సైట్లు పెరిగిపోతున్నాయి.
ఈ క్రమంలో గంటకో సంచలన వార్త తెరమీదికి వస్తోంది. వీటిని చూడాలి వదిలేయాలి! అనే విధంగా వ్యవహరించాలి. కానీ చంద్రబాబు మాత్రం ప్రతి వార్తను పట్టించుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ.. అది గ్యాసిప్ అయినా.. నిజమే అయినా.. సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అదే ఆయనపై విమర్శలు గుప్పిస్తోందని అంటున్నారు. తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచా రం కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది. అయితే.. ఇది నిజమెంత? వాస్తవానికి ఇప్పటికిప్పుడు జగన్ ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అనేది చర్చ నీయాంశంగా మారింది.
అయితే.. ఈ విషయంపై చంద్రబాబు ఏమనకున్నారో.. ఏమో.. ముందస్తు వస్తుందని.. అలా వార్తలో.. గ్యాసిప్పో వచ్చీరావడంతో ఆయన అలెర్ట్ అయిపోయారు. నియోజకవర్గాలపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఎవరిని ఉంచాలి? ఎవరిని ఏరేయాలి? అనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. వయో వృద్ధులకు అవకాశం ఇవ్వకుండా వారిని పక్కన పెడుతున్నారు. పోనీ.. అదేసమయంలో పార్టీ కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారా? అంటే.. కేవలం వారసులకు మాత్రమే ఎంట్రీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో చంద్రబాబు వైఖరిపై తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి జగన్ వ్యూహం ఏంటో తెలియదు.. కేవలం ముందస్తు అనేది సోసల్ మీడియాలో వచ్చిన ప్రచారం. కానీ, దీనిని పట్టుకుని మా నాయకుడు.. చర్యలు చేపట్టారు! అని వారు పెదవి విరుస్తున్నారు. మరి ఇంత ఉలికి పాటు ఉంటే రాజకీయాల్లో మంచిదేనా? అంటున్నారు పరిశీలకులు.దీనిని బాబు ఏం చెబుతారో చూడాలి.