ఏపీ కేబినెట్లో ఉన్న బీజేపీ మంత్రి మాణిక్యాల రావు మొదటినుంచీ టీడీపీపై కాస్త గుర్రుగా ఉంటున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో మంచి సంబంధాలు పెంచుకున్న ఆయన ఏ పని కావాలన్నా అక్కడి నుంచే నరుక్కొస్తున్నారు. ఆయన సీఎం చంద్రబాబును కూడా పెద్దగా లెక్క చేయరని చెబుతుంటారు... తాజాగా అది నిజమని నిరూపితమైంది.
పుష్కరాల పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పనులపై అసంతృప్తి ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు వైఫల్యమిది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. దీంతో... మాణిక్యాలరావు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వెంటనే చంద్రబాబుకు సమాధానమిచ్చారట. పేరుకు తాను దేవాదాయ శాఖ మంత్రినే అయినా పనులకు తనకు సంబంధం లేకుండా చేశారనీ... అన్నీ టీడీపీ నాయకులకే అప్పగించి వారితోనే చేయిస్తున్నారు కదా ఇంక నాకెందుకు అడగడం అన్నట్లుగా ఆయన సీరియస్ అయ్యారట. పుష్కర కమిటీలు నియమించినప్పుడు నన్ను ఒక్క మాటైనా అడిగారా... మరి ఇప్పుడు పుష్కరాల పనుల గురించి నన్నెందుకు అడుగుతారు వారినే అడగండి అంటూ ఆయన చంద్రబాబును డైరెక్టు గా అనేసేసరికి చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తెల్లమొఖాలు వేశారు.
అయితే.. మాణిక్యాల రావు చాలాకాలంగా చంద్రబాబు, టీడీపైపై గుర్రుగా ఉన్నారు. నిజానికి పుష్కర కమిటీల విషయంలో ఆయన్ను సంప్రదించలేదు. మంత్రులు యనమల, నారాయణలతో ఈ కమిటీలను నడిపించారు. అలాగే పుష్కరాల లోగో ఆవిష్కరణ సమయంలోనూ మంత్రికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కేవలం గంట ముందు ఆ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న మాణిక్యాల రావు సమయం రాగానే నేరుగా చంద్రబాబునే అడిగేశారని తెలుస్తోంది. దీంతో ఏం సమాదానం చెప్పాలో తెలియక చంద్రబాబు ఇరకాటంలో పడ్డారట.